ETV Bharat / sports

బాక్సింగ్ పోటీలు: శివ థాపకు పతకం ఖాయం

author img

By

Published : May 25, 2021, 10:38 PM IST

ఆసియన్​ ఛాంపియన్​షిప్స్​లో భారత బాక్సర్ శివ థాప(64 కేజీ) పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్స్​లో కువైట్ బాక్సర్​ నాదర్​ ఓడాను మట్టికరిపించాడు. 5-0 తేడాతో విజయం సాధించిన థాప.. సెమీస్​లోకి దూసుకెళ్లాడు. మరో పోటీలో మహమ్మద్ హుసాముద్దీన్ పరాజయం పొందాడు.

shiva thapa, indian boxer
శివ థాప, భారత బాక్సర్

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియన్ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్​ శివ థాప(64 కేజీ) వరుసగా ఐదో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్స్​లో కువైట్​ బాక్సర్​ నాదర్​ ఓడాపై ​5-0 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో సెమీస్​లోకి దూసుకెళ్లిన థాప.. ఈ సీజన్​లో ఏదో ఒక పతకాన్ని గెలుపొందనున్నాడు.

మరో పోటీలో మహమ్మద్ హుసాముద్దీన్(56 కేజీ) పరాజయం పాలయ్యాడు. క్వార్టర్​ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్​ బాక్సర్​ మిరాజిజ్​బెక్​ మిర్జాహాలిలోవ్​తో జరిగిన పోరులో 1-4తో​ ఓడిపోయాడు. ఆసియన్ గేమ్స్ ఛాంపియన్​ అయిన మిరాజిజ్​బెక్​.. తీవ్రమైన పంచ్​లతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. హుసాముద్దీన్ ఒకట్రెండు పంచ్​లతో పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

సోమవారం రాత్రి జరిగిన మరో పోటీలో భారత బాక్సర్​ సుమిత్ సంగ్వాన్​(81 కేజీ).. ఇరాన్​ బాక్సర్​ మేసం ఘెస్లాగి చేతిలో ఓడిపోయాడు. ఇక బుధవారం జరగనున్న పోటీల్లో అమిత్ పంగాల్, వికాస్ క్రిష్ణన్, ఆశీష్ కుమార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంగోలియా బాక్సర్​ ఖార్ఖు ఎన్ఖ్మండఖ్​తో పంగాల్ తలపడనున్నాడు. ​

ఇదీ చదవండి: మొహాలీ స్టేడియానికి దిగ్గజ హాకీ ఆటగాడి పేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.