ETV Bharat / sports

భారత్​ ఖాతాలో మూడు స్వర్ణాలు.. సత్తా చాటిన ఆంధ్రా పరుగుల రాణి జ్యోతి!

author img

By

Published : Jul 13, 2023, 9:51 PM IST

Asian Athletics Championships : ఆంధ్రప్రదేశ్​కు చెందిన జ్యోతి యర్రాజీ మరోసారి పరుగు పందెంలో సత్తా చాటింది. ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్స్​లో స్వర్ణం సాధించి భారత్​కు మరో స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది. జ్యోతితో పాటు భారత్​కు చెందిన మరో ఇద్దరు అథ్లెట్లు కూడా బంగారు పతకాలు సాధించారు.

Asian Athletics Championships 2023
ఆసియా అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​ 2023 జ్యోతి యర్రాజీ

Asian Athletics Championships 2023 : జూలై 12న బ్యాంకాక్‌లో ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్స్​లో ఆంధ్రప్రదేశ్​కు చెందిన 23 ఏళ్ల జ్యోతి యర్రాజీ సత్తా చాటింది. ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్స్​లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్​లో​ గెలుపొంది భారత్​కు మరో స్వర్ణాన్ని అందించింది. కేవలం 13.09 సెకన్లలో ఈ ఫీట్​ను అందుకుంది. జపాన్​కు చెందిన టెరాడా అసుకా (13.13 సెకన్లు), అయోకి మసుమి (13.26 సెకన్లు) రన్నరప్​లుగా నిలిచారు. అలాగే భారత్​కు చెందిన మరో ఇద్దరు అథ్లెట్లు కూడా వేర్వేరు విభాగాల్లో పాల్గొని బంగారు పతకాలు గెలుపొందారు. దీంతో ఆట రెండో రోజే భారత్​ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి.

Ajay Kumar Saroj Gold Medal : గురువారం ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ఈవెంట్​లోని పురుషుల విభాగంలో భారత అథ్లెట్​ 26 ఏళ్ల అజయ్ కుమార్ సరోజ్ 1500 మీటర్ల హర్డిల్స్​లో​ నెగ్గి స్వర్ణం సాధించాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సిరోజ్​ వ్యక్తిగత అత్యుత్తమం 3:39.19 సెకన్లు కాగా.. ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్స్​లో కేవలం 2 నిమిషాల 30 సెకన్లు తీసుకున్నాడు. ఇతడు 2017లో భువనేశ్వర్‌లో స్వర్ణం, 2019లో దోహాలో రజతం సాధించాడు.

  • @JyothiYarraji bags the 1⃣st🥇for 🇮🇳 at the ongoing Asian Athletics Championships 2023 🥳

    The #TOPSchemeAthlete clocked a time of 13.09s in Women's 100m Hurdles Event.

    Meanwhile, her counterpart Nithya Ramaraj clocked 13.55s & finished 4⃣th at the event. pic.twitter.com/WPGCcHHoOM

    — SAI Media (@Media_SAI) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Abdulla Aboobacker Gold Medal : ఇక కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత 27 ఏళ్ల అబ్దుల్లా అబూబకర్ పురుషుల ట్రిపుల్ జంప్(16.92 మీటర్లు) ఈవెంట్‌లో గెలుపొంది తన నాల్గవ ప్రయత్నంలో భారత్​కు ముచ్చటగా మూడో స్వర్ణం అందించాడు. జపాన్‌కు చెందిన ఇకెహటా హికారు (16.73 మీ), కొరియాకు చెందిన జాంగ్వూ కిమ్ (16.59 మీ) రన్నరప్​లుగా నిలిచారు. భారత్​కు చెందిన మరో అథ్లెట్​ ఐశ్వర్య మిశ్రా (53.07 సెకన్లు) మహిళల 400 మీటర్ల విభాగం​లో కాంస్యం గెలిచింది. ఇక బుధవారం ప్రారంభమైన ఈ పోరులో పురుషుల విభాగంలోని 10వేల మీటర్ల రేసులో మరో భారత్​ పరుగు వీరుడు అభిషేక్ పాల్ కాంస్యం గెలిచి భారత్​ పతకాల ఖాతాను తెరిచాడు.

  • Asian Athletics Championship (Bangkok) Update: India have so far won 6 medals (3 Gold, 3 Bronze)
    ➡️ GOLD: Jyothi Yarraji: 100m Hurdles | Ajay Kumar: 1500m | Abdulla Aboobacker: Triple Jump
    ➡️ Bronze: Abhishek: 10,000m | Aishwarya: 400m | Tejaswin Shankar: Decathlon @afiindia pic.twitter.com/IEg6WbJp1d

    — India_AllSports (@India_AllSports) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో ఆంధ్రా అమ్మాయి..
Jyothi Yarraji Gold Medal : జ్యోతి యర్రాజీ జాతీయ రికార్డు 12.82 సెకన్లుగా ఉంది. గతనెల 16న భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ సీనియర్‌ అంతర్​రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్​లో కూడా జ్యోతి యర్రాజీ ఒక స్వర్ణం (12.92 సెకన్లు), ఒక కాంస్య పతకాలను దక్కించుకుంది. ప్రస్తుతం బ్యాంకాక్​లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్స్​ పోటీలు ఈనెల 16వరకు జరగనుండగా.. భారత్​ నుంచి మొత్తం 54 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందులో ఆంధ్ర నుంచి మరో అమ్మాయి దండి జ్యోతిక శ్రీ కూడా ఉన్నారు. ఇక 200 మీటర్ల విభాగంలో కూడా జ్యోతి యర్రాజీ తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.