అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రిలీఫ్ ఫండ్ పేరిట చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్ పోటీల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్ కామత్ కూడా పోటీపడి ఆనంద్‌ను ఓడించారు. అయితే, అతడు మోసం చేసి గెలిచినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్) కార్యదర్శి భరత్ చౌహన్ స్పందించారు. ఛారిటీ పోటీల్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని వాపోయారు.
ఈ క్రమంలోనే నిఖిల్ కామత్ కూడా ట్విట్టర్లో ఓ పోస్టు చేసి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. "నేను చిన్నప్పుడు చెస్ నేర్చుకునే రోజుల్లో విశ్వనాథ్ ఆనంద్‌తో ఆడాలనుకున్నా. అది నిన్నటితో నిజమైంది. అక్షయపాత్ర సంస్థ వారు ఆనంద్‌తో కలిసి ఛారిటీ కోసం చెస్ పోటీలు నిర్వహించడం వల్ల నాకు ఆ అవకాశం దక్కింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే, నేను నిజంగానే విశ్వనాథ్ ఆనంద్‌ను చెస్‌లో ఓడించానని చాలా మంది అనుకుంటున్నారు. అది తప్పు. అదెలా ఉందంటే నేను నిద్రలేచిన వెంటనే ఉసేన్ బోల్ట్‌తో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీపడి గెలిచినట్లుగా ఉంది" అని నిఖిల్ పోస్టు చేశారు.
-
It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV
— Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV
— Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV
— Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021
"ఆనంద్ సర్‌తో ఆడిన గేమ్‌లో నేను కొంత మంది వ్యక్తులు, కంప్యూటర్ నుంచి సహాయం పొందా. ఈ పోటీలు కేవలం సంతోషం, ఫండ్ రైజింగ్ కోసమే నిర్వహించారు. అయితే, నేను చేసిన పనితో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని అస్సలు ఊహించలేదు. అందుకు క్షమాపణలు చెబుతున్నా" అని ట్వీట్‌లో పేర్కొన్నారు నిఖిల్. అనంతరం దీనిపై స్పందించిన చెస్ దిగ్గజం ఆనంద్.. "నిన్న పలు రంగాల ప్రముఖులతో ఆడటమనేది ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించడానికి. ఆటలోని నియమాలు పాటిస్తూ ఆడటం చాలా సంతోషంగా అనిపించింది. ఆటలో ఎదురైన పరిస్థితులను బట్టే నేను ఆడాను. ఇతరుల నుంచి కూడా అదే ఆశించాను" అని విశ్వనాథన్ రీట్వీట్ చేశారు.
-
Yesterday was a celebrity simul for people to raise money It was a fun experience upholding the ethics of the game.I just played the position onthe board and expected the same from everyone . pic.twitter.com/ISJcguA8jQ
— Viswanathan Anand (@vishy64theking) June 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yesterday was a celebrity simul for people to raise money It was a fun experience upholding the ethics of the game.I just played the position onthe board and expected the same from everyone . pic.twitter.com/ISJcguA8jQ
— Viswanathan Anand (@vishy64theking) June 14, 2021Yesterday was a celebrity simul for people to raise money It was a fun experience upholding the ethics of the game.I just played the position onthe board and expected the same from everyone . pic.twitter.com/ISJcguA8jQ
— Viswanathan Anand (@vishy64theking) June 14, 2021
ఇదీ చదవండి: CHESS: 'తగ్గుతున్న చెస్ క్రీడాకారుల కెరీర్ టైమ్'