ETV Bharat / sports

ఫ్రెంచ్​ బాక్సింగ్​ టోర్నీలో అమిత్​, సంజీత్​ల​కు స్వర్ణం - అమిత్​ పంఘల్​

అలెక్సిస్​ వాస్టిన్​ ఇంటర్నేషనల్​ బాక్సింగ్​ టోర్నీలో భారత బాక్సర్లు సత్తాచాటారు. అమిత్​ పంఘల్​, సంజీత్​ వేర్వేరు విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించారు.

Amit Panghal, Sanjeet strike gold at French boxing tourney
ఫ్రెంచ్​ బాక్సింగ్​ టోర్నీలో అమిత్​, సంజీత్​ల​కు స్వర్ణం
author img

By

Published : Oct 31, 2020, 2:57 PM IST

ఫ్రాన్స్​లోని నాంటెస్​ వేదికగా జరుగుతున్న అలెక్సిస్​ వాస్టిన్​ ఇంటర్నేషనల్​ బాక్సింగ్​ టోర్నమెంట్​లో భారత బాక్సర్లు సత్తాచాటారు. అమిత్​ పంఘల్​ (52 కిలోలు), సంజీత్​ (91 కిలోలు) వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలను సాధించారు.

అమెరికన్​ రెనే అబ్రహాంను 3-0 తేడాతో ఓడించి పతకం ఖాయం చేసుకున్నాడు అమిత్​ పంఘల్​. మరోవైపు ఫ్రెంచ్​ ఆటగాడు సోహెబ్​ బౌఫియాను సంజీత్​ ఓడించాడు. 57 కిలోల విభాగంలో స్థానిక బాక్సర్​ శామ్యూల్​ కిస్టోహూర్రీతో పోటీకి దిగిన కవిందర్​ సింగ్​ బిష్ట్​ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. శివ థాపా (63 కిలోలు), సుమిత్​ సంగ్వాన్​ (81 కిలోలు), సతీశ్​ కుమార్​ (+91 కిలోలు) రూపంలో భారత్​కు మూడు కాంస్య పతకాలు లభించాయి.

మార్చిలో జోర్డాన్​ వేదికగా జరిగిన ఒలింపిక్​ అర్హత పోటీ తర్వాత భారత బాక్సర్లు పాల్గొన్న మొదటి అంతర్జాతీయ టోర్నీ ఇదే. ఇందులో 9 మంది భారతీయులు (5 పురుషులు, 4 మహిళలు) టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.