రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. సెమీస్‌కు చేరిన అమిత్ పంఘాల్(52 కేజీలు), మనీశ్ కౌశిక్(63 కేజీలు).. పతకాలు ఖరారు చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఒకరు కంటే ఎక్కువ మంది బాక్సర్లు సెమీస్ చేరడం ఇదే తొలిసారి.
ఈ విషయంపై స్పందించిన బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ).. ఇందులో పతకాలు సాధించిన క్రీడాకారులు.. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారని వెల్లడించింది.
"అమిత్, మనీశ్.. క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తారు. వారికి ఎటువంటి ట్రయల్స్ నిర్వహించం". -శాంటియాగే నైవా, భారత బాక్సింగ్ హై కమీషనర్
మిగతా భారత బాక్సర్లు.. వ్యక్తిగత ప్రదర్శన, జాతీయ ఈవెంట్ల్లో పాయింట్ల ఆధారంగా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు ఎంపిక అవుతారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సెమీస్‌లోకి అడుగుపెట్టిన అమిత్ పంఘాల్.. కజికిస్థాన్కు చెందిన సాకెన్ బిబోసినోవ్తో తలపడనున్నాడు. టాప్ సీడ్ ప్లేయర్ ఆండీ గోమేజ్‌తో తాడోపేడో తేల్చుకోనున్నాడు కౌశిక్. వీరిద్దరూ ఇందులో గెలిచి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలవాలని చూస్తున్నారు.
2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అమిత్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ పతకం నెగ్గాడు. జాతీయ మాజీ ఛాంపియన్ అయిన కౌశిక్.. 2018 కామన్వెల్త్ గేమ్సలో వెండి పతకం సొంతం చేసుకున్నాడు.
ఇది చదవండి: ముందు కోహ్లీ.. తర్వాత మిల్లర్.. వాట్ ఏ క్యాచ్