ETV Bharat / sports

బాక్సింగ్​ టోర్నీ సెమీస్​లో అమిత్​ - రష్యా బాక్సింగ్ టోర్నమెంట్

రష్యా వేదికగా జరుగుతోన్న బాక్సింగ్​ టోర్నమెంట్​లో భారత బాక్సర్​ అమిత్​ పంగాల్ సెమీస్​లో అడుగుపెట్టాడు​. ఇతర విభాగాల్లో పోటీ పడిన మరో ఐదుగురు బాక్సర్ల టోర్నీని నిష్క్రమించారు.

Amit Panghal
అమిత్​ పంగాల్​
author img

By

Published : Apr 22, 2021, 2:12 PM IST

రష్యాలోని సెయింట్​ పీటర్స్​బర్గ్​ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్​ టోర్నీ 52 కిలోల విభాగంలో భారత బాక్సర్​ అమిత్​ పంగాల్​ సెమీఫైనల్​కు దూసుకెళ్లాడు. స్థానిక బాక్సర్​ తమీర్​ గాలనోవ్​పై 5-0 తేడాతో విజయం సాధించి సెమీస్​కు చేరుకున్నాడు.

ఇదే టోర్నీలో భారత్​కు చెందిన బాక్సర్లు సుమిత్​ సంగ్వాన్​ (81 కిలోల విభాగం), మహ్మద్​ హుస్సాముద్దీన్​ (57 కిలోలు), నమన్ తన్వర్ (91 కిలోలు), ఆశిష్​ కుమార్ (75 కిలోలు), వినోద్ తన్వర్ (49 కిలోలు) ఇప్పటికే నిష్క్రమించారు.

రష్యాకు చెందిన ఇగోర్​ త్సారెగోరోడ్ట్సేవ్​తో 49 కిలోల విభాగంలో వినోద్​ తవ్వర్​ ఓడిపోయాడు. ఉజ్బెకిస్థాన్​ బాక్సర్​ డిషోడ్​ రుజ్మెటోవ్​(81 కేజీలు)పై సుమిత్​ సంగ్వాన్​ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 91 కేజీల విభాగంలో కజకిస్థాన్​కు చెందిన ఐబక్​ ఓరల్బేపై 0-5 తేడాతో నమన్​ తన్వర్​ ఓడిపోయాడు.

మరోవైపు రష్యాకు చెందిన నికితా కుజ్మిన్​తో 75 కేజీల విభాగంలో ఆశిష్​ కుమార్​.. ఉజ్బెకిస్థాన్ మిరాజిజ్​ మురాఖాలిలోవ్​తో 57 కిలోల విభాగంలో జరిగిన మ్యాచ్​లో మహ్మద్​ హుస్సాముద్దీన్​ పరాజయాన్ని చవిచూశారు.

ఇదీ చూడండి.. 'టీమ్​ఇండియాకు అతడు భవిష్యత్​ ఆల్​రౌండర్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.