ETV Bharat / sports

డోపింగ్ పరీక్షలు మిస్.. ఒలింపిక్స్​కు దూరం - olympics 2021American sprinter Stevens

గతేడాది మూడుసార్లూ డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోవడం వల్ల 18నెలల నిషేధానికు గురైంది స్ప్రింటర్ స్టీవెన్స్. దీంతో వచ్చే సంవత్సరం జరగబోయే ఒలింపిక్స్​కు దూరమైంది.

డోపింగ్ టెస్టులకు గైర్హాజరు.. ఒలింపిక్స్​కు దూరం
అమెరికన్ స్ప్రింటర్ స్టీవెన్స్
author img

By

Published : Jul 17, 2020, 9:05 AM IST

ఒలింపిక్స్​కు అర్హత సాధించిన అమెరికన్ స్ప్రింటర్ డేజా స్టీవెన్స్.. 18 నెలల నిషేధానికి గురైంది. గతేడాది మూడుసార్లు డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోవడం వల్లే అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్​ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్​కు దూరం కానుంది. ఈమెపై నిషేధం ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమై, వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్ చివరి రోజుల్లో ముగుస్తుంది.

స్టీవెన్స్ డోపింగ్ శాంపిల్స్​ కోసం అధికారులు గతేడాది రెండుసార్లు ఫోన్​లో సంప్రదించగా, ఆ సమయంలో ఈమె అందుబాటులో లేకుండా పోయింది. అయితే బ్యాటరీ అయిపోవడం, ఆకతాయి వేధింపుల వల్ల నంబర్ మార్చిన సమయాల్లోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

American sprinter Stevens
అమెరికల్ స్ప్రింటర్ స్టీవెన్స్

200 మీటర్ల రన్నర్​ అయిన స్టీవెన్స్.. 2016 రియో ఒలింపిక్స్​ ఫైనల్​లో ఏడో స్థానంలో, 2017 ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో ఐదో స్థానం సంపాదించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.