ETV Bharat / sports

All England Open: అదరగొడుతున్న గాయత్రి జోడీ.. సెమీస్‌లోకి భారత జంట - గాయత్రి గోపీచంద్​ సెమీఫైనల్స్​

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్​లో భారత జంట గాయత్రి గోపీచంద్‌, ట్రీసా జాలీ అదరగొడుతోంది. మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించిందీ జోడీ.

all england open 2023 indian gayatri gopichand pullela enters into semifinals

author img

By

Published : Mar 18, 2023, 6:35 AM IST

Updated : Mar 18, 2023, 6:43 AM IST

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ రసవత్తరంగా సాగుతోంది. భారత్ స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది. మరో ఆటగాడు శ్రీకాంత్‌ పరాజయం పాలయ్యాడు. హెచ్​ ఎస్​ ప్రణయ్‌ కూడా వెనుదిరిగాడు. ఎన్నో ఆశలతో వెళ్లిన యువ సంచలనం లక్ష్యసేన్‌ కథ ముగిసింది. పురుషుల డబుల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ జంట ఓడింది. ఇలా అగ్రశ్రేణి క్రీడాకారులు వరుసగా ఇంటిముఖం పడుతున్నా.. భారత ఆశలను మోస్తూ యువ జంట గాయత్రి గోపీచంద్‌, ట్రీసా జాలీ సత్తా చాటుతోంది.

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్​ మ్యాచ్​లో గాయత్రి- ట్రీసా జోడీ 21-14, 18-21, 21-12తో వెన్‌ మీ- ల్యూ షువాన్‌ (చైనా) జంటపై విజయం సాధించింది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 17-21, 15-21తో కొడయ్‌ నరవొక (జపాన్‌) చేతిలో, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 20-22, 21-15, 17-21తో ఆంథోనీ జింటింగ్‌ (ఇండోనేసియా) చేతిలో, లక్ష్యసేన్‌ 13-21, 15-21తో ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం చవిచూశారు.

గతేడాది చివరి నిమిషంలో ఆల్‌ ఇంగ్లాండ్‌ మెయిన్‌ డ్రాలో అడుగుపెట్టి రాణించిన గాయత్రి- ట్రీసా జోడీ.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఆడుతోంది. ఇప్పటికే తొలి రౌండ్లో ఏడో సీడ్‌.. ప్రిక్వార్టర్స్‌లో మాజీ నంబర్‌వన్‌ జోడీలకు షాకిచ్చింది. క్వార్టర్స్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. చైనా జంటను చిత్తుచేసింది. 54 నిమిషాల మ్యాచ్​లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గాయత్రి- ట్రీసా జోడీ.. 6-2తో మొదటి గేమ్‌ను మొదలుపెట్టింది. 6-6తో చైనా జంట పాయింట్లను సమం చేసినా పుంజుకుని 11-8తో పైచేయి సాధించింది. సూపర్​ షాట్లు ఆడుతూ పాయింట్లు రాబట్టిన గాయత్రి- ట్రీసా జంట 18-12తో ముందంజ వేసింది. 21-14తో తొలి గేమ్‌ను గెలుచుకుంది.

రెండో గేమ్‌లోనూ 10-6తో ఆధిపత్యం ప్రదర్శించింది. వెన్‌- షువాన్‌ జోడీ పోటాపోటీగా ఆడింది. 13-15తో వెనుకంజలో ఉన్న స్థితి నుంచి 17-15తో ఆధిక్యం సంపాదించింది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 21-18తో రెండో గేమ్‌ నెగ్గింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఏకపక్షంగా సాగింది. గాయత్రి- ట్రీసా జోడీ వరుస పాయింట్లతో విజృంభించింది. 8-1తో గేమ్‌ను మొదలుపెట్టి 13-5తో ఆధిక్యం సంపాదించింది. చైనా జంటకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-12తో విజయం సాధించింది.

Last Updated : Mar 18, 2023, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.