జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమా? అయితే తొమ్మిదేళ్ల పాటు అథ్లెటిక్స్‌లో తన హవాను కొనసాగించిన బోల్ట్ రికార్డు బద్దలైంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 12 స్వర్ణాలు దక్కించుకుని బోల్ట్‌ను వెనక్కినెట్టింది అమెరికాకు చెందిన అలిసన్ ఫెలిక్స్. జమైకా చిరుత 11 స్వర్ణాలతో ఆమె తర్వాత స్థానంలో ఉన్నాడు.
దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 4X400 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకంతో బోల్ట్‌ను అధిగమించింది అలిసన్. అమెరికా మిక్స్డ్ రిలే జట్టు 3 నిమిషాల 9.34 సెకన్లలో పరుగును పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ పోటీలో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచి పతకం సాధించడంలో విఫలమైంది.
-
🇺🇸 @Wil_WL3 + @allysonfelix + @courtneyokolo + @MCJR__ = 🥇🥇🥇🥇
— IAAF (@iaaforg) September 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Team @usatf break mixed 4x400m relay world record for the second time in as many days.
📰: https://t.co/C3FvuKyYh6#WorldAthleticsChamps pic.twitter.com/1dGk8CncaL
">🇺🇸 @Wil_WL3 + @allysonfelix + @courtneyokolo + @MCJR__ = 🥇🥇🥇🥇
— IAAF (@iaaforg) September 29, 2019
Team @usatf break mixed 4x400m relay world record for the second time in as many days.
📰: https://t.co/C3FvuKyYh6#WorldAthleticsChamps pic.twitter.com/1dGk8CncaL🇺🇸 @Wil_WL3 + @allysonfelix + @courtneyokolo + @MCJR__ = 🥇🥇🥇🥇
— IAAF (@iaaforg) September 29, 2019
Team @usatf break mixed 4x400m relay world record for the second time in as many days.
📰: https://t.co/C3FvuKyYh6#WorldAthleticsChamps pic.twitter.com/1dGk8CncaL
పదినెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిందీ అమెరికా స్ప్రింటర్. పరుగు సమయంలో కుమార్తే కామ్రిన్ కూడా స్టేడియంలో ఉంది. తల్లయిన తర్వాత ఆమెకు ఇదే మొదటి స్వర్ణం.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 200 మీటర్ల రేసులో ఫెలిక్స్ మూడు స్వర్ణాలు గెలుచుకోగా.. 400 మీటర్ల విభాగంలో ఓ బంగారు పతకం సాధించింది. 4X100 మీటర్ల మహిళల రిలేలో మూడు స్వర్ణాలను.. తాజా పతకంతో కలిపి 4X400 మిక్స్డ్ రిలేలో ఐదు పసిడి పతకాలను కైవసం చేసుకుంది. మొత్తం 12 స్వర్ణాలను ఖాతాలో వేసుకుంది.
ఇదీ చదవండి: 'ధోనీ గురించి కాదు.. దేశం గురించి ఆలోచించాలి'