ETV Bharat / sports

భారత 66వ చెస్ గ్రాండ్​ మాస్టర్​గా ఆకాశ్ - భారత 66వ చెస్ గ్రాండ్​ మాస్టర్​గా ఆకాశ్

తమిళనాడుకు చెందిన యువ ఆటగాడు ఆకాశ్.. భారత్ తరఫున 66వ చెస్ గ్రాండ్ మాస్టర్​ హోదా దక్కించుకున్న వ్యక్తిగా నిలిచాడు.

భారత 66వ చెస్ గ్రాండ్​ మాస్టర్​గా ఆకాశ్
చెస్ గ్రాండ్​ మాస్టర్​ ఆకాశ్
author img

By

Published : Jul 5, 2020, 10:15 PM IST

తమిళనాడుకు చెందిన జీ.ఆకాశ్.. భారతదేశ 66వ చెస్ గ్రాండ్​ మాస్టర్​గా అవతరించాడు. ఇటీవలే జరిగిన చెస్ ఫెడరేషన్​ రెండో కౌన్సిల్ సమావేశంలో ఇతడికి ఈ హోదా ఇస్తున్నట్లు ఖరారు చేశారు. ఆకాశ్ తోటి ప్లేయర్లు అయిన ఎమ్. ప్రణీశ్, అమేయా అడిలు అంతర్జాతీయ మాస్టర్ టైటిల్స్ సాధించారు.

గ్రాండ్ మాస్టర్ హోదా(ఫిడే రేటింగ్ 2495) వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పిన ఆకాశ్... 2600 ఫిడే రేటింగ్​ సాధించడమే తన ప్రస్తుత లక్ష్యమని వెల్లడించాడు.

2012లో జాతీయ టోర్నీలో విజేతగా నిలిచిన ఆకాశ్.. ఆ తర్వాత అంతర్జాతీయ మాస్టర్స్ హోదా సాధించాడు. 2014లో ఇంజినీరింగ్ చేసేందుకు నాలుగేళ్లు విరామం తీసుకుని మళ్లీ 2018లో ఆటలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ హోదా తెచ్చుకున్నాడు.

లాక్​డౌన్​తో ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఆకాశ్.. చెస్ టోర్నీలను చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు. పరిస్థితులు త్వరగా చక్కదిద్దుకోవాలని కోరుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.