Adhoc Committee For WFI : డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌తో పాటు ఆయ కార్యవర్గ బృందానికి తాజాగా క్రీడా మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇకపై డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను నిర్వహించడానికి ఓ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోరిందట. ఇందులో భాగంగా ఇకైపై రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలను ఆ తాత్కాలిక కమిటీ చూసుకోవాలంటూ ఐఓఏకు క్రీడా శాఖ లేఖ రాసింది.
Sakshi Malik WFI Suspension : మరోవైపు తాజాగా ఈ విషయంపై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందించింది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదని అయితే మా పోరాటం మహిళా ప్లేయర్ల కోసమే అని చెప్పుకొచ్చింది.
"ఇంకా ఈ విషయంపై అధికారిక సమాచారం ఏమీ రాలేదు. సంజయ్ సింగ్‌ను మాత్రమే సస్పెండ్ చేశారా లేదా మొత్తం కార్య వర్గాన్ని సస్పెండ్ చేశారా అన్న విషయం కూడా నాకు తెలియదు. ప్రభుత్వంతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. మా పోరాటం మహిళా రెజ్లర్ల కోసం మాత్రమే. నేను రిటైర్మెంట్ ప్రకటించాను. కానీ ఇకపై ఈ ఫీల్డ్‌లోకి రానున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను" అంటూ సాక్షి మాలిక్ స్పందించింది.
Brij Bhushan About Sanjay Singh : మరోవైపు ఇదే విషయంపై రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కూడా స్పందించారు. సంజయ్ సింగ్ తన బంధువు కాదని చెప్పిన ఆయన క్రీడా పోటీల నిర్వాహణ నిర్ణయం విషయంలో మొత్తం 25 ఫెడరేషన్లు తమ మౌఖిక, రాతపూర్వక అనుమతిని ఇచ్చాయంటూ పేర్కొన్నారు.
" సంజయ్ సింగ్ నా బంధువు కాదు. నందిని నగర్‌లో U-15, U-20 నేషనల్ గేమ్స్‌ను తిరిగి ప్రారంభించేలా చూడటం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. డిసెంబర్ 31న సెషన్ ముగియనుండటం వల్ల క్రీడాకారులకు ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది అందుకే పాత కమిటీ అండర్-15, అండర్-20 జాతీయ ఆటగాళ్ల కోసమే ఈ విషయాన్ని చర్చించింది. ఇందులో భాగంగానే తొందరపడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇందుకు అన్ని సమాఖ్యలు తమ మద్దతు తెలిపాయి. అయితే అన్ని సమాఖ్యలు వీటిని నిర్వహించలేమని చెప్పడం వల్ల నంది నగర్‌లో ఈ క్రీడలను నిర్వహించాలని నిర్ణయించాం" అంటూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివరించారు.
బ్రిజ్ భూషణ్ అనుచరుడికి పగ్గాలు - రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్
WFI కొత్త చీఫ్‌కు షాక్- సంజయ్ సింగ్ కార్యవర్గం సస్పెండ్- కారణం ఇదే!