ETV Bharat / sports

ఒమన్‌ ఓపెన్‌ టీటీ ఫైనల్లో శరత్​.. పదేళ్ల కళ నెరవేరేనా? - ఒమన్‌ ఓపెన్‌ టీటీ ఫైనల్లో శరత్​.. పదేళ్ల కళ నెరవేరేనా?

ఒమన్​ ఓపెన్​ టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్​లో ఫైనల్​ చేరాడు అచంట శరత్ కమల్​​. తమిళనాడుకు చెందిన ఈ ఆటగాడు సెమీస్​లో కిరిల్​ కచ్​కోవ్​(రష్యా)పై గెలుపొందాడు. ఐటీటీఎఫ్​ టోర్నీలో పదేళ్ల తర్వాత తుది పోరుకు అర్హత సాధించాడు.

Achanta Sharath Kamal
ఒమన్‌ ఓపెన్‌ టీటీ ఫైనల్లో శరత్​.. పదేళ్ల కళ నెరవేరేనా?
author img

By

Published : Mar 15, 2020, 11:26 PM IST

ఒమన్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌(టీటీ) టోర్నీలో... భారత స్టార్​ ప్లేయర్​ అచంట శరత్​ కమల్​ తుది పోరుకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన సెమీస్​ మ్యాచ్​లో వరుసగా రెండు సెట్లు​ ఓడిపోయినా.. కీలక సమయంలో అద్భుతంగా పోరాడి రాణించాడు. ఫలితంగా కిరిల్​ కచ్​కోవ్​(రష్యా)పై గెలుపొందాడు. ఏడు రౌండ్లు జరిగిన మ్యాచ్​లో 11-13, 11-13, 13-11, 11-9, 13-11, 8-11, 11-7 తేడాతో గెలిచాడు.

37 ఏళ్ల ఈ తమిళ ప్లేయర్​.. టైటిల్​ పోరులో మార్కస్​ ఫ్రిటస్​(పోర్చుగల్​)తో తలపడనున్నాడు. ఈ ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్​కు వెళ్లేందుకు ఇతడికి మెరుగైన ర్యాంక్​ లభిస్తుంది. 2010లో అంతర్జాతీయ టీటీ ఫెడరేషన్​ నిర్వహించిన ఈజిప్ట్​ ఓపెన్​ చివరిగా ఫైనల్​ చేరాడు శరత్​. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఓపెన్​లో టైటిల్​ పోరులో నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.