ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​కు వెళ్తున్నారా? ఇవి పాటించాల్సిందే! - టోక్యో ఒలింపిక్స్​లో ప్రయాణికులను మార్గనిర్దేశకాలు

టోక్యో ఒలింపిక్స్​ జపాన్ చేరుకునే వారికి ఆ దేశ ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటిని​ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఇంతకీ అవేంటి? క్వారంటైన్​లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది?

A look at what quarantine is like in Olympic-host Japan
టోక్యో వెళ్తున్నారా? అయితే మీరు ఇవి పాటించాల్సిందే!
author img

By

Published : Feb 11, 2021, 10:18 AM IST

Updated : Feb 11, 2021, 10:45 AM IST

టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభానికి ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. జపాన్​లో కరోనా కొత్త కేసులు పెరుగుతున్న కారణంగా ఇప్పుడు అక్కడికి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఒలింపిక్స్​ చూడాలనుకునే వారికోసం ఆ దేశ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. విదేశీయుల జపాన్​ చేరుకోవడానికి చేయాల్సిన పనులేంటి? అక్కడికి వెళ్లిన తర్వాత ఏ నిబంధనలను పాటించాలి? లాంటి అంశాల సమాహారమే ఈ కథనం.

A look at what quarantine is like in Olympic-host Japan
టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​కు వెళ్లేందుకు విమానం ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది?

ఒలింపిక్స్​ కోసం జపాన్​ వెళ్లే క్రీడా అభిమానులు.. టోక్యో విమానం ఎక్కే ముందు కెన్కో కార్ట్​ (హెల్త్​ కార్డ్​)ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందు 14 రోజులు వారు ఏఏ దేశాల్లో ఉన్నారు? జపాన్​లో 14 రోజుల పాటు ఎక్కడ స్వీయనిర్బంధంలో ఉంటారనే సమాచారాన్ని ఆ కార్డులో పొందుపరచాల్సి ఉంటుంది.

జపాన్​ చేరుకున్నాక నిర్బంధంలో ఉండాలా?

అవును, వివిధ దేశాల్లో కరోనా కొత్త రకం వైరస్​ పుట్టుకొస్తున్న కారణంగా జపాన్​ ప్రభుత్వం.. ప్రయాణికులకు నిర్బంధాన్ని తప్పనిసరి చేసింది. కరోనా వ్యాప్తి స్థాయిని బట్టి.. యుకే, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్​, బ్రెజిల్​ దేశాల నుంచి వచ్చే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాల్లో గానీ.. విమానాశ్రయానికి దగ్గర్లోని హోటల్స్​లో గానీ.. కనీసం మూడు రోజులు ఉండాలి.

జపాన్​ చేరిన తర్వాత చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్​గా తేలితే మూడు రోజుల క్వారంటైన్​లో ఉండి.. ఆ తర్వాత వెళ్లొచ్చు. కానీ, ఆ తర్వాత 11 రోజులు వారికి నచ్చిన ప్రదేశంలోని ఉంటూ నిర్బంధాన్ని పూర్తి చేయాల్సిఉంటుంది.

విమానాశ్రయం నుంచి బయటకు ఎలా వెళ్తారు?

జపాన్​ చేరిన వెంటనే విమానాశ్రయంలో కరోనా టెస్ట్​ చేయించుకోవాల్సి ఉంటుంది. దాని ఫలితాన్ని బట్టి ఇమిగ్రేషన్​ ఆఫీసర్​ ప్రయాణికులను క్వారంటైన్​కు చేరుస్తారు.

కరోనా వ్యాప్తి ఎక్కువగా (లెవల్​-3) ఉన్న దేశాల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఉచిత షటిల్​ బస్సులను నడపనున్నారు. రాబోయే మూడు రోజుల పాటు ఎక్కడ నిర్బంధం ఉంటారో తెలుసుకుని అక్కడ విడిచిపెడతారు. ఒకవేళ ప్రయాణికులు వారి స్వీయనిర్బంధంలో ఉండాలని అనుకుంటే మాత్రం ప్రజారవాణా సదుపాయాలను వాడుకోవడానికి వీలులేదు.

జపాన్​ చేరుకున్నాక ఎక్కడ నిర్బంధంలో ఉండాలి? అందుకు నగదు చెల్లించాలా?

కొవిడ్​ టెస్ట్​లో వచ్చే ఫలితమేదైనా.. విదేశీయులు మాత్రం తప్పనిసరిగా మూడు రోజులు క్వారంటైన్​లో ఉండాల్సిందే. విమానాశ్రయం దగ్గర్లోని సముదాయాల్లో లేదా హోటల్స్​లో నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి భోజనం, రవాణా ఖర్చులను జపాన్​ ప్రభుత్వమే భరిస్తుంది.

క్వారంటైన్​ ఎలా ఉండబోతుంది?

రోజుకు మూడుసార్లు భోజనాన్ని డోర్ డెలివరీ చేస్తారు. కొన్ని హోటల్స్​లో మాత్రం లాండ్రీ సదుపాయం కూడా ఉంది. నిర్బంధంలో ఆల్కహాల్​ సేవించడం నిషేధం. క్వారంటైన్​లో ప్రతిరోజు ఉదయాన్నే తమ శరీర ఉష్ణోగ్రతను చరవాణి ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. భోజనం లేదా కొవిడ్​ పరీక్ష కోసం మాత్రమే గది తలుపులు తెరవాలి. మూడో రోజు నిర్బంధంలో మరోసారి కొవిడ్​ టెస్ట్ చేస్తారు. అందులో నెగెటివ్​గా తేలితే ప్రయాణికులకు ఇష్టమైన స్వీయనిర్బంధానికి వెళ్లొచ్చు. కానీ, మిగిలిన 11 రోజుల క్వారంటైన్​ను కచ్చితంగా పూర్తి చేయాలి. అందుకోసం ప్రజారవాణాను ఉపయోగించడం నిషేధం.

నిర్బంధం నుంచి బయటకు వచ్చే సమయంలో ఏం జరుగుతుంది?

జపాన్​ ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్​ తాలుకూ మొబైల్​ అప్లికేషన్​ను చరవాణిలో ఇన్​స్టాల్​ చేసుకున్నారా? లేదా? ఓ హెల్త్​ వర్కర్​ పరిశీలిస్తారు. అందుకోసం ప్రతిఒక్కరూ తమ లోకేషన్​ను యాక్సిస్​ చేయాల్సిఉంటుంది. ఒకవేళ స్మార్ట్​ఫోన్​ లేని ప్రయాణికులు ప్రతిరోజు ఫోన్​చేసి తర్వాతి 11 రోజుల స్వీయనిర్బంధ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లైతే.. స్వదేశీయులైతే పేరు వివరాలను బహిర్గతం చేస్తారు. విదేశీయులు అలా చేస్తే వారు ఉండే ప్రదేశం నుంచి పంపిచడమే కాకుండా దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.

ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులూ ఈ నియమాలే పాటించాలా?

అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ, స్థానిక టోక్యో క్రీడా నిర్వాహకులు.. 205 దేశాలతో కలిసి ఒలింపిక్స్​లో పాల్గొనే 15,400 మంది క్రీడాకారులకు 'ప్లేబుక్స్​' అనే ప్రత్యేక నిబంధనలను విడుదల చేశారు. కానీ, ఇందులోని ప్రణాళికలు ఎప్పటికప్పుడూ మారుతున్నాయి.

ఆ ప్లేబుక్స్​ను ఏప్రిల్​, జూన్​లో మార్పులు చేస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అథ్లెట్లు తమ ప్రయాణానికి 14 రోజుల ముందు వారు శరీర ఉష్టోగ్రత వివరాలు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. టోక్యో ప్రయాణానికి ముందు 72 గంటల్లో ఒక్కసారైనా కరోనా పరీక్ష చేయించుకోవాలి. అందులో నెగెటివ్​గా తేలితేనే విమానం ఎక్కాలి. జపాన్​ చేరుకున్న తర్వాత విమానాశ్రయంలో మరోసారి కొవిడ్​ టెస్ట్​ చేస్తారు. అందులోనూ వైరస్​ లేదని నిర్ధరణ అయితేనే వారందరిని ఒలింపిక్స్​ విలేజ్​కు శానిటైజ్​ చేసిన వాహనంలో పంపుతారు.

ఒలింపిక్స్​ విలేజ్​ను సురక్షితమైన బయోబబుల్​లో ఏర్పాటు చేస్తారు. అందులో నాలుగు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలను నిర్వహిస్తారు. బయోబబుల్​లో క్రీడాకారులు ప్రాక్టీసు చేసుకోవడానికి సదుపాయాలను ఉంటాయి. ప్లేయర్లు వారి అభిమానులకు, మీడియాకు దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఆన్​లైన్​లోనే ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది.

క్రీడాకారులంతా వారి తొలి పోటీకి ఐదు రోజుల ముందుగా రావడానికి అనుమతిస్తారు. ముగిసిన రెండు రోజుల తర్వాత తిరిగి బయలుదేరాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఒలింపిక్స్​ కోసం ఏర్పాటు చేసిన విలేజ్​లో పర్యటకానికి అవకాశం లేదని వారు తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​లో ఆలింగనం బ్యాన్- లక్షన్నర కండోమ్స్​ రెడీ!

'భారత అథ్లెట్స్​కు కరోనా టీకా​ అందించాలి'

Last Updated : Feb 11, 2021, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.