ఒలింపిక్స్.. క్రీడల్లోనే అత్యుత్తమ ఈవెంట్. అందుకే విశ్వక్రీడలుగా పిలుచుకుంటారు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఈ మహా క్రీడాసంగ్రామంలో పతకం సాధించాలని, ప్రతి ప్లేయర్ కలలు కంటాడు. కొన్నిసార్లు విజయం సాధించినా.. మరికొన్నిసార్లు కొద్దిలో మిస్ అవుతాడు! కానీ ఈ ప్రయాణంలో అతడు చూపిన పట్టుదల, కృషి మాత్రం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి సంఘటనల ఆధారంగా పలు భాషల్లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? వాటి కథేంటి?
1. ఛారియట్స్ ఆఫ్ ఫైర్
1924 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇద్దరు బ్రిటీష్ అథ్లెట్ల కథే ఈ సినిమా. ఇప్పటివరకు వచ్చిన ఉత్తమ క్రీడాచిత్రాల్లో ఇదొకటి. ఉద్వేగభరితంగా సాగిపోయే ఈ సినిమాలో, తన కష్టాలపై మనిషి విజయం సాధించడాన్ని చాలా చక్కగా చూపించారు. కథ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. క్రీడాభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. ఐ, టాన్య
ఒలింపిక్ స్కేటర్ టాన్యా హార్డింగ్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'ఐ, టాన్య'. పోటీలో భాగంగా నాన్సీ కెర్రిగన్తో ఆమెకు జరిగిన గొడవను ఇతివృత్తంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే టాన్యను సపోర్ట్ చేస్తూ ఈ సినిమా తీసినట్లు ఉందని విమర్శలు వచ్చాయి. అయితే డ్రామాతో పాటు హాస్యం కూడా ఉండటం వల్ల ఈ స్పోర్ట్స్ సినిమా.. ప్రేక్షకుల మెప్పు పొందింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. భాగ్ మిల్కా భాగ్
'ఫ్లయింగ్ సిఖ్'గా గుర్తింపు తెచ్చుకున్న ప్రపంచస్థాయి అథ్లెట్ మిల్కా సింగ్. ఒలింపిక్స్ పతకం రాలేదు.. కానీ ఆయన జీవితంలో అంతకుమించిన డ్రామా ఉంది. అందుకే 'భాగ్ మిల్కా భాగ్' టైటిల్‌తో సినిమా కూడా తీశారు. 1960 ఒలింపిక్స్‌లో అతడు పాల్గొనడం, పతకం కొద్దిలో మిస్ కావడం లాంటి అంశాల్ని ఇందులో చాలా అద్భుతంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. భావోద్వేగాలతో పాటు ఓ సాధారణ అథ్లెట్.. స్టార్‌గా ఎలా మారాడు అనేదే ఈ సినిమా.
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్.. లీడ్ రోల్ పోషించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. మ్యూనిచ్
స్టీవెన్ స్పీల్బర్గ్ 'మ్యూనిచ్'.. క్రీడాచిత్రం కాదు. ఒలింపిక్స్‌లో జరిగిన అత్యంత విషాదకర సంఘటనకు దృశ్యరూపం. 1972 ఒలింపిక్స్‌లో కోసం వచ్చిన ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టును పాలస్తీనా టెర్రిరిస్టులు బందిస్తారు. ముందు ఇద్దరు ప్లేయర్లను చంపిన టెర్రరిస్టులు.. అధికారులు, సహాయక చర్యలకు ప్రయత్నించి, విఫలం కావడం వల్ల మిగిలిన క్రీడాకారుల్ని కూడా చంపేశారు. స్పీల్బర్గ్, ఇజ్రాయెల్‌కు మద్దతుదారుడే అయినప్పటికీ, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. ఫాక్స్క్యాచర్
1984 ఒలింపిక్స్‌లో పాల్గొన్న మార్క్- డేవిడ్ ష్కాల్జ్ అనే అన్నదమ్ముల మధ్య పోటీని చూపించిన సినిమా 'ఫాక్స్ క్యాచర్'. మిగతా క్రీడా చిత్రాల కంటే దీనిని డార్క్ ఎమోషన్స్‌తో, దర్శకుడు బెన్నెట్ మిల్లర్ తెరకెక్కించారు. ఏం చేసైనా సరే గెలవాలి అనే పాయింట్‌ను ఇందులో చూపించారు. ప్రధాన పాత్రల్లో నటించిన స్టీవ్ కారెల్, చన్నింగ్ టాటమ్, ప్రేక్షకుల్ని విశేషంగా మెప్పించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: