ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మల్లయోధుడు సునీల్ కుమార్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. గ్రీకో రోమన్ 87 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సునీల్.. 27 ఏళ్ల తర్వాత ఈ కేటగిరిలో పసిడి గెలిచిన భారత రెజ్లర్‌గా నిలిచాడు.
పసిడి కల...
మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సునీల్ 5-0తో అజత్ సలిదినోవ్ (కిర్గిస్థాన్)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్‌లో ఈ భారత రెజ్లర్ 11-8తో అజ్మత్ (కజకిస్థాన్)పై విజయం సాధించాడు. ఒక దశలో 1-8తో వెనకబడిన అతను వరుసగా 11 పాయింట్లు సాధించి నెగ్గడం విశేషం. 1993లో చివరిగా పప్పూ యాదవ్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్‌లో స్వర్ణం గెలిచాడు. భారత్‌కు మరో పసిడి అందించిన ఆటగాడిగా సునీల్ ఘనత సాధించాడు.
ఇదే టోర్నీలో మరో భారత రెజ్లర్ అర్జున్ (55 కేజీలు) కాంస్యం గెలిచాడు. కాంస్య పతక పోరులో అర్జున్ 7-2తో నాసర్‌పోర్ (ఇరాన్)ను ఓడించాడు.
ఇదీ చూడండి...