పాటియాలాతో పాటు బెంగుళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో 30 మంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. మొత్తం 741 మందికి పరీక్షలు నిర్వహించగా.. తాజా కేసులు బయటపడినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) వెల్లడించింది. వీరిలో 313 మందికి పరీక్షలు పాటియాలా ఎన్ఐఎస్లో చేయగా 26 కేసులు వచ్చాయి. మిగతా 428 టెస్ట్‌లు బెంగుళూరు ఎన్ఐఎస్లో నిర్వహించగా 4 కేసులు బయటపడ్డాయు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఒక్క అథ్లెట్ కూడా వీరిలో లేరు.
"పాటియాలాతో పాటు బెంగుళూరు జాతీయ క్రీడా సంస్థలలో ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించాం. మొత్తం 741 మందికి టెస్ట్ చేయగా.. వారిలో 30 మంది ఆటగాళ్లకి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. వీరిలో ఏ ఒక్కరు కూడా ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు లేకపోవడం శుభపరిణామం. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆ క్యాంపస్‌లు మొత్తం శానిటైజ్ చేశాం."
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.
వైరస్ సోకిన వారిలో భారత పురుషుల బాక్సింగ్ ప్రధాన కోచ్ సీఏ కట్టప్ప, షాట్‌పుట్ కోచ్ మొహిందర్ సింగ్ థిల్లాన్‌లు ఉన్నారు. పాటియాలాలో వైరస్ సోకిన 26 మందిలో 10 మంది.. కేవలం ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగానికి చెందిన ఆటగాళ్లే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: 'ధోనీ సారథ్యంలో ఆడాలనేది ప్రతి ఆటగాడి కోరిక'