2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలే ఇంకా పూర్తి కాలేదు.. 2024 విశ్వక్రీడల ప్రచారం మొదలైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరగనున్న ఈ ఒలింపిక్స్ క్రీడల లోగోను విడుదల చేశారు. సోమవారం పారిస్లో ఈ కార్యక్రమం జరిగింది. పారాలింపిక్స్ లోగోనూ ఇక్కడ ఆవిష్కరించారు.
బంగారు పతకం, ఒలింపిక్స్, పారాలింపిక్స్ జ్యోతి, మహిళ ముఖాన్ని ప్రతిబింబించేలా అమ్మాయి పెదవులతో ఈ ఒలింపిక్ చిహ్నాన్ని రూపొందించారు. ఈ మూడూ ఒకే గుర్తులో ఉండటం వల్ల ఈ లోగో మరింత ఆసక్తికరంగా మారింది.
పారిస్లో ఇప్పటివరకు రెండు సార్లు విశ్వక్రీడలు నిర్వహించారు. 1900, 1924లో ఈ పోటీలు జరిగాయి. 2024లో మూడోసారి ఆతిథ్యమివ్వనుంది పారిస్. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: ఐపీఎల్: రాజస్థాన్ కొత్త కోచ్గా ఆసీస్ మాజీ క్రికెటర్