ఫైనల్ మ్యాచ్ అంటే ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడం మామూలే. కానీ దిల్లీలో జరిగిన ఓ హాకీ మ్యాచ్‌లో ఆటగాళ్లు అంతకుమించి గొడవపడ్డారు. స్టిక్స్‌తో పరస్పరం దాడులు చేసుకొని... మైదానాన్ని రణరంగంగా మార్చారు. ఈ సంఘటన నెహ్రూ కప్ హాకీ టోర్నీలో భాగంగా పంజాబ్ పోలీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జట్ల మధ్య జరిగింది. సోమవారం ఇరుజట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఫైనల్ మ్యాచ్ మూడో క్వార్టర్లో స్కోరు 3-3తో ఉన్న సమయంలో ఈ రభస మొదలైంది. గొడవను ఆపిన నిర్వాహకులు... మ్యాచ్‌ను కొనసాగించగా పీఎన్బీ 6-3తో విజయం సాధించింది. నెహ్రూ కప్‌లో పాల్గొనకుండా టోర్నీ నిర్వాహకులు పోలీస్ జట్టుపై నాలుగేళ్లు, పీఎన్బీపై రెండేళ్ల నిషేధం విధించారు. అంతేకాకుండా రూ. 2 లక్షల ప్రైజ్‌మనీలో... సగం కోత విధించి ఇచ్చారు.