ఒలింపిక్స్ టెస్టు ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది భారత మహిళల హాకీ జట్టు. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్ను 2-1 తేడాతో ఓడించింది ఉమెన్ టీమిండియా. టోక్యోలోని నార్త్ పిచ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డాయి ఇరుజట్లు. చివరకు విజయం భారత్‌నే వరించింది.
-
FT: 🇮🇳 2-1 🇯🇵
— Hockey India (@TheHockeyIndia) August 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The Eves continue to impress us as they emerge victorious against the hosts in the FINALS. 🙌👏#IndiaKaGame #ReadySteadyTokyo #Tokyo2020 #INDvJPN @WeAreTeamIndia pic.twitter.com/0xFZlCIkSc
">FT: 🇮🇳 2-1 🇯🇵
— Hockey India (@TheHockeyIndia) August 21, 2019
The Eves continue to impress us as they emerge victorious against the hosts in the FINALS. 🙌👏#IndiaKaGame #ReadySteadyTokyo #Tokyo2020 #INDvJPN @WeAreTeamIndia pic.twitter.com/0xFZlCIkScFT: 🇮🇳 2-1 🇯🇵
— Hockey India (@TheHockeyIndia) August 21, 2019
The Eves continue to impress us as they emerge victorious against the hosts in the FINALS. 🙌👏#IndiaKaGame #ReadySteadyTokyo #Tokyo2020 #INDvJPN @WeAreTeamIndia pic.twitter.com/0xFZlCIkSc
తొలి అర్ధభాగంలోని 11వ నిమిషం వద్ద మొదటి గోల్ చేసింది భారత క్రీడాకారిణి నవజోత్ కౌర్. తర్వాతి నిమిషంలో జపాన్ ప్లేయర్ షిముజు గోల్ చేయడం వల్ల రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. అయితే రెండో అర్ధభాగంలో మిజోరాం అమ్మాయి లారెమ్సైమీ... పెనాల్టీ కార్నర్‌తో పాయింటు తెచ్చింది. ఫలితంగా టెస్టు ఈవెంట్లో విజేతగా నిలిచింది మహిళా హాకీ టీమిండియా.
గతంలో జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లోనూ ఇదే జట్టుపై విజయం సాధించింది రాణీ రాంపాల్ సారథ్యంలోని జట్టు. ఇదే ఆత్మవిశ్వాసంతో త్వరలో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ పోటీలకు వెళ్లనుంది మహిళల హాకీ బృందం.
ఈ రోజు జరిగిన పురుషుల టెస్టు ఈవెంట్లోనూ 5-0 తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది భారత మెన్స్ హాకీ జట్టు.