ఒడిశా మరో ప్రతిష్టాత్మక హాకీ టోర్నీకి(Junior Hockey World Cup) ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో ఇక్కడ జూనియర్ హాకీ ప్రపంచకప్ జరగనుంది. నవంబర్ 24న స్థానిక కళింగ స్టేడియంలో(Kalinga Stadium Hockey World Cup) ఆరంభమయ్యే ఈ టోర్నీ డిసెంబర్ 5న ముగియనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Naveen Patnaik Hockey) తెలిపారు. గురువారం ఆయన ఈ టోర్నీ లోగో, ట్రోఫీని ఆవిష్కరించారు.
"జూనియర్ హాకీ ప్రపంచకప్ నిర్వహించాల్సిందిగా హాకీ ఇండియా నుంచి ప్రతిపాదన వచ్చింది. మెగా టోర్నీకి సన్నద్ధం కావడానికి చాలా తక్కువ సమయం ఉన్నా.. నిర్వహించేందుకు అంగీకరించాం. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ఈ టోర్నీలో భారత్ సత్తా చాటుతుందని భావిస్తున్నాం."
- నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి
ఇంతకుముందు 2018లో సీనియర్ హాకీ ప్రపంచకప్, 17 ఎఫ్‌ఐహెచ్ ప్రపంచ లీగ్, 2014 ఛాంపియన్స్ ట్రోఫీలకు ఒడిశా ఆతిథ్యం ఇచ్చింది. 2028లో పురుషుల సీనియర్ ప్రపంచకప్‌ను(భువనేశ్వర్, రూర్కెలాలలో) నిర్వహించేందుకు ఒడిశా ఏర్పాట్లు చేస్తోంది. జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో 16 జట్లు(Junior Hockey World Cup 2021 Schedule) తలపడనున్నాయి. భారత్‌తో పాటు కొరియా, మలేసియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, బెల్జియం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా, కెనడా, చిలీ, అర్జెంటీనా ఈ టోర్నీలో ఆడనున్నాయి. కొవిడ్ కారణంగా తమ దేశంలో ప్రయాణ నిబంధనలు ఉండడం వల్ల ఆస్ట్రేలియా టోర్నీ నుంచి తప్పుకుంది.
ఇదీ చూడండి.. Manika Batra News: మనిక ఆరోపణలపై విచారణకు హైకోర్టు ఆదేశం