ఒలింపిక్స్.. హాకీలో భారత్ జట్టు మరోసారి అదరగొట్టింది. స్పెయిన్‌పై 3-0 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచింది టీమ్ఇండియా. తర్వాతి మ్యాచ్‌ల్లో అర్జెంటీనా, జపాన్‌తో ఆడనుంది.
స్పెయిన్‌తో మ్యాచ్‌లో రూపిందర్‌పాల్ సింగ్, సిమ్రన్‌జీత్ సింగ్ మంచి ప్రదర్శన చేశారు. ఆట 13వ నిమిషంలోనే సిమ్రన్‌జీత్ కొట్టిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. 15వ నిమిషంలో.. పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేసుకున్న రూపిందర్ రెండో గోల్‌ను అందించాడు. నాలుగో క్వార్టర్లో.. మరో గోల్ చేశాడు రూపిందర్. దీంతో మ్యాచ్ 3-0 తేడాతో భారత్ వశమైంది.
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో గెలిచిన మన్‌ప్రీత్ సేన, ఆ తర్వాత ఆసీస్ చేతిలో 7-1 తేడాతో చిత్తయింది.
ఇదీ చూడండి: Tokyo Olympics: ఈ ఒలింపిక్స్‌లో రష్యా కనిపించలేదేంటి!