హాకీ ఇండియా జాతీయ ఛాంపిన్షిప్స్ టోర్నీలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు అధికారులు. కరోనా కారణంగా ఏప్రిల్ 14 వరకు తొలుత లాక్డౌన్ విధించారు. దీంతో ఏప్రిల్ 29 నుంచి జులై 3 వరకు క్రీడలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఆ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం, ఈరోజు నిర్ణయం తీసుకుంది. దీంతో పోటీలు ఆపక తప్పలేదు. అయితే వాటిని ఎప్పటికి వాయిదా వేశారు అనే విషయాల్ని మాత్రం వెల్లడించలేదు.
హాకీ ఆటగాళ్లు, కోచ్‌లు, నిర్వహకులు, అభిమానులు, అధికారులు ఆరోగ్యం దృష్ట్యా ఈ పోటీలను వాయిదా వేశామని చెప్పారు హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్. ప్రస్తుత పరిస్థితి సద్దుమణిగిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామన్నారు.
ఇదీ చూడండి : యువరాజ్ ఫౌండేషన్‌కు అఫ్రిది భారీ విరాళం