దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంను ఒడిశాలోని రవుర్కెలాలో నిర్మించనున్నారు. 2023 హాకీ ప్రపంచ కప్ నాటికి స్టేడియం సిద్ధం కానుంది. స్టేడియం నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతిపెద్దది కానున్న ఈ స్టేడియానికి స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా పేరు పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.
బిజుపట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలోని 15 ఎకరాలను ఈ మైదానం కోసం కేటాయించారు. 20 వేల మంది కూర్చునే సామర్థ్యం సహా ఇతర సదుపాయల్ని ఇందులో కల్పించనున్నారు.
2023లో ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్‌ను భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంతో పాటు రవుర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: టెస్టు ఛాంపియన్షిప్: రెండో స్థానంలో టీమ్ఇండియా