ఒడిశాలో నిర్మితమవుతున్న ప్రపంచస్థాయి హాకీ స్టేడియం.. మరో ఏడాదిలోగా పూర్తి కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహోపాత్ర మంగళవారం వెల్లడించారు.
రూర్కెలాలోని బిజు పట్నాయక్ సాంకేతిక విశ్వవిద్యాలయ (బీపీటీయూ) క్యాంపస్‌లో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. 2023లో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్‌నకు ఇది రెండో వేదిక కానుంది. టోర్నీని భువనేశ్వర్‌లోనూ నిర్వహించనున్నారు.
"ఇది భారత్‌లోనే పెద్ద హాకీ స్టేడియంగా నిలవబోతోంది. బీపీటీయూ క్యాంపస్‌లో దీనిని నిర్మిస్తున్నాం. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఏడాదిలోగా పూర్తవుతాయి"
- సురేశ్ చంద్ర మహోపాత్ర, ఒడిశా ప్రధాన కార్యదర్శి
పార్కింగ్ సహా ఇతర సదుపాయాల కల్పనకు కూడా పనులు అప్పుడే ప్రారంభమవుతాయని సీఎస్ వెల్లడించారు. 15 ఎకరాల్లో 20 వేల సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి: భారత హాకీ దిగ్గజం మైఖేల్ కిండో కన్నుమూత