ETV Bharat / sports

హాకీ: 6-1 తేడాతో జర్మనీపై భారత్​ గెలుపు - Indian men's hockey

కరోనా వల్ల ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. 2021లో తొలి విజయం సాధించింది. యూరప్​ పర్యటనలో జర్మనీతో జరిగిన మ్యాచ్​లో 6-1 గోల్స్​ తేడాతో గెలుపొందింది.

Indian men's hockey team return to international competition with roaring win against Germany team return to international competition with roaring win against Germany
6-1 తేడాతో జర్మనీపై భారత్​ గెలుపు
author img

By

Published : Feb 28, 2021, 10:56 PM IST

Updated : Mar 1, 2021, 12:15 AM IST

కొవిడ్​ నేపథ్యంలో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. తొలి విజయం నమోదు చేసింది. యూరప్​ టూర్​లో జర్మనీ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్​ల టోర్నీలో తొలి మ్యాచ్​లో ఆతిథ్య జట్టుపై 6-1 గోల్స్​ తేడాతో ఇండియా గెలుపొందింది. గోల్​కీపర్​ పీఆర్​ శ్రేజేష్​ జట్టుకు నేతృత్వం వహించాడు.

12 నెలల తర్వాత ఆడుతున్న భారత జట్టు ప్రత్యర్థి టీమ్​కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. గెలవాలన్న కసి వారి ఆటలో స్పష్టంగా కనిపించింది. ఇండియా తరఫున నీలకంఠ శర్మ(13వ నిమిషంలో), వివేక్​ సాగర్​ ప్రసాద్​(27, 28వ నిమిషాలలో), లలిత్​ కుమార్ ఉపాధ్యాయ (41వ నిమిషంలో), ఆకాశ్​ దీప్ సింగ్(42వ నిమిషంలో), హర్మన్​ప్రీత్ సింగ్(47వ నిమిషంలో)లు గోల్స్​ చేశారు.

ఇరు జట్లలో తొలి గోల్​ భారత్​ తరఫున పెనాల్టీ కార్నర్​ ద్వారా సాధించగా.. 14వ నిమిషంలో జర్మనీ మొదటి గోల్​ కొట్టింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాత వివేక్​ సాగర్​ వరుసగా రెండు గోల్స్​ సాధించడం వల్ల ఇండియా 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఆతిథ్య టీమ్​ను ఎక్కడా కోలుకోనివ్వలేదు.

తదుపరి మ్యాచ్​ మార్చి 2న జర్మనీతోనే జరగనుంది. మార్చి 6,8 తేదీల్లో గ్రేట్​ బ్రిటన్​తో ఆడనుంది టీమ్​ఇండియా.

ఇదీ చదవండి: చివరి టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న భారత్​

Last Updated : Mar 1, 2021, 12:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.