ప్రపంచ హాకీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్ల్లో భారత హాకీ జట్లు అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకున్నాయి. మన్‌ప్రీత్ సేన మూడో స్థానంలో నిలువగా, మహిళల జట్టు ఎనిమిదో ర్యాంకును దక్కించుకుంది. గతంతో పోల్చితే ఇరు జట్లు ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. పురుషుల హాకీ జాబితాలో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా, బెల్జియం రెండో ర్యాంకును కైవసం చేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాయి భారత హాకీ జట్లు. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెలుపొందింది. జర్మనీతో జరిగిన పతక పోరులో 5-4 తేడాతో సునాయాస విజయం సాధించింది. ఇక రాణి రాంపాల్ సేన తృటిలో మెడల్‌ను పోగొట్టుకుంది. విశ్వక్రీడల్లో టాప్-4లో నిలిచింది. గ్రేట్ బ్రిటన్‌తో మ్యాచ్‌లో 4-3తో పరాజయం పాలైంది. అయినప్పటికీ మహిళల జట్టు స్ఫూర్తిదాయక ఆటను ప్రదర్శించారు.
చివరిసారిగా మార్చిలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు నాలుగో స్థానంలో ఉంది. మహిళల టీమ్ తొమ్మిదో ర్యాంకులో నిలిచింది.
ఇదీ చదవండి: హాకీ స్టిక్ సింహనాదం.. అభిమానుల భావోద్వేగం!