భారత హాకీ జట్టు అజ్లాన్ షా హాకీ టోర్నీలో అదరగొడుతోంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పోలండ్పై ఏకంగా 10-0 తేడాతో జయభేరి మోగించింది. జాతీయ క్రీడను మరింత అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మలేషియాలోని ఇపోలో జరుగుతున్న ఫైనల్ టోర్నీలో భారత్, కొరియా తలపడనున్నాయి.
పోలండ్‌తో జరిగిన నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో స్ట్రయికర్ మన్‌దీప్ సింగ్ మరోసారి మెరిశాడు. వెంట వెంటనే రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. డ్రాగ్‌ఫ్లికర్ వరుణ్ కుమార్ రెండు, వివేక్ సాగర్, సుమిత్ కుమార్ , సురేందర్ కుమార్ , సిమ్రన్‌జీత్ సింగ్, నీలకంఠ శర్మ, అమిత్ రోహిత్‌దాస్ చెరో గోల్ చేశారు. టోర్నీ మొత్తం మంచి ప్రదర్శన చేసింది భారత్.
- ఐదుసార్లు ఛాంపియన్:
ఆరోసారి కప్పు కొట్టాలని బరిలోకి దిగిన భారత్ ఈ టోర్నీలో మంచి ప్రదర్శన కనపరిచింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 13 పాయింట్లతో... పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో కొరియాతో జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది.