ETV Bharat / sports

మొహాలీ స్టేడియానికి దిగ్గజ హాకీ ఆటగాడి పేరు

మొహాలీ అంతర్జాతీయ స్టేడియాన్ని ఇకపై దిగ్గజ హాకీ క్రీడాకారుడు బల్బీర్ సింగ్ సీనియర్​ పేరుతో పిలవాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ప్రథమ వర్దంతి సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ రాష్ట్ర క్రీడల మంత్రి గుర్మిత్ సింగ్ పేర్కొన్నారు.

balbir singh, Hockey stadium renamed
బల్బీర్ సింగ్, దిగ్గజ హాకీ క్రీడాకారుడు
author img

By

Published : May 25, 2021, 8:51 PM IST

మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరు మారుస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివంగత హాకీ ఆటగాడు బల్బీర్​ సింగ్​ సీనియర్​ తొలి వర్దంతి సందర్భంగా ఆయన పేరును స్టేడియానికి పెట్టారు.

"దిగ్గజ హాకీ క్రీడాకారుడు, పద్మ శ్రీ బల్బీర్​ సింగ్ సీనియర్​ ప్రథమ వర్దంతి సందర్భంగా.. మొహాలీ స్టేడియాన్ని ఆయనకు అంకితమిస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ స్టేడియం పేరు బల్బీర్ సింగ్ సీనియర్​ అంతర్జాతీయ హాకీ స్టేడియంగా మారుతుంది" అని పంజాబ్ క్రీడల మంత్రి రానా గుర్మిత్ సింగ్ సోధి తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: బోరున ఏడ్చిన క్రికెటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.