భువనేశ్వర్‌లో హాకీ సిరీస్ ఫైనల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది భారత ఒలింపిక్ అసోషియేషన్(ఐఓఏ). వీటి నిర్వహణపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో వివరణ ఇచ్చింది.
- భారత ఒలింపిక్ అసోషియేషన్(ఐఓఏ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 6 నుంచి 16 వరకు హకీ సిరీస్ ఫైనల్స్‌ను ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కచ్చితంగా గెలవాల్సిందేనా..!
ఉగ్రదాడికి నిరసనగా హాకీ ప్రో లీగ్ నుంచి భారత్ బయటకు వచ్చేసింది. ప్రస్తుతం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న హాకీ సిరీస్ ఫైనల్స్‌లో.. కచ్చితంగా గెలిస్తేనే భారత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.
- ప్రపంచవ్యాప్తంగా మూడు హాకీ సిరీస్ ఫైనల్స్ నిర్వహిస్తారు. ఎనిమిది జట్లు పోటీ పడతాయి. ఈ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారే 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.
- అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు నరీందర్ బత్రా.. భారత ఒలింపిక్ సంఘానికి చీఫ్‌గా వ్యవహరించడం విశేషం.
ఏం జరిగింది...?
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య క్రీడల్లోనూ సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ముగ్గురు పాక్ షూటర్లకు వీసాలు నిరాకరించింది భారత్.
- దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. క్రీడా ఒప్పందాల ఉల్లంఘన కింద పరిగణిస్తూ భారత్‌లో ఎలాంటి అంతర్జాతీయ క్రీడలు నిర్వహించకూడదని వేటు వేసింది.
ఐఓసీ నిషేధం నేపథ్యంలో జులైలో భారత్‌లో జరగాల్సిన కుస్తీ జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్ పోటీలు విదేశాలకు తరలి వెళ్లాయి.