2020 టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ కోసం పోటీ పడుతోన్న భారత్‌కు మిశ్రమ డ్రా పడింది. పాకిస్థాన్‌తో మ్యాచ్ పడే అవకాశంపై ముందు నుంచి కొనసాగుతున్న ఉత్కంఠ తొలగిపోయింది. సోమవారం తీసిన డ్రాలో భారత పురుషుల జట్టుకు రష్యాతో మ్యాచ్ పడింది. మహిళా జట్టు అమెరికాతో పోటీపడనుంది. రెండు మ్యాచ్‌లు భువనేశ్వర్ వేదికగా జరగనున్నాయి.
తాజా డ్రాపై స్పందించిన పురషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్... క్వాలిఫయర్ మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నామన్నాడు. అయితే, రష్యాను తేలికగా తీసుకోలేమని అభిప్రాయపడ్డాడు.
"ఏ జట్టునూ తేలికగా తీసుకోలేం. ముఖ్యంగా రష్యా ఆటతీరు, సామర్థ్యం మాకు పూర్తిగా తెలుసు. ఈ మ్యాచ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫైయర్ రౌండ్ కావటం వల్ల వాళ్లు కచ్చితంగా బాగా ఆడాలనుకుంటారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపైనే మా దృష్టి ఉంది."
-మన్‌ప్రీత్ సింగ్, పురషుల హాకీ జట్టు కెప్టెన్.
నవంబర్ 1, 2 తేదీల్లో మన్‌ప్రీత్ బృందం భువనేశ్వర్ వేదికగా రష్యాతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా టోక్కో బెర్తు ఖాయం చేసుకుంటుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 5వ ర్యాంకులో ఉండగా.. రష్యా 22వ స్థానంలో ఉంది. భువనేశ్వర్‌లోనే నవంబర్ 1,2 తేదీల్లో జరిగే పోరులో మహిళా టీమిండియా, అమెరికా జట్లు తలపడనున్నాయి. ఇందులో భారత్ 9, అమెరికా 13వ స్థానాల్లో ఉన్నాయి.
పురుష జట్ల డ్రా వివరాలు...
1.జర్మనీ, ఆస్ట్రేలియా
2.భారత్, రష్యా
3.నెదర్లాండ్, పాకిస్థాన్
4.స్పెయిన్, ఫ్రాన్స్
5.కెనడా, ఐర్లాండ్
6.బ్రిటన్, మలేషియా
7. న్యూజిలాండ్, కొరియా
మహిళా జట్ల డ్రా వివరాలు...
1.జర్మనీ, ఇటలీ
2.ఆస్ట్రేలియా, రష్యా
3. బ్రిటన్, చిలీ
4. భారత్, అమెరికా
5. చైనా, బెల్జియం
6. ఐర్లాండ్, కెనడా
7. స్పెయిన్, కొరియా
8. కెనడా, ఐర్లాండ్
9. బ్రిటన్, మలేషియా
10. న్యూజిలాండ్, కొరియా
ఇదీ చూడండి: బంగ్లాదేశ్‌పై అఫ్గాన్ సంచలన విజయం