భారత మాజీ హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 104 డిగ్రీల జ్వరంతో పాటు న్యూమోనియా రావడం వల్ల ఆయన్ని ఆసుపత్రిలో చేర్చించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 96 ఏళ్ల బల్బీర్.. ప్రస్తుతం చంఢీగడ్‌లో కుమార్తె, మనవడుతో కలిసి ఉంటున్నారు.
గతంలోనూ న్యూమోనియాకు గురైన బల్బీర్‌ను ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు ఆయన 108 రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు. 1948, 1952, 1956 ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న భారత హాకీ జట్టులో ఈయన సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 1971, 1975లలో కోచ్‌గానూ వ్యవహరించారు. అందులో వరుసగా రజతం, గోల్డ్ మెడల్ గెల్చుకుంది ఆ బృందం.