'2020 టోక్యో ఒలింపిక్స్' టెస్ట్ ఈవెంట్‌కు మహిళా జట్టును ప్రకటించింది హాకీ ఇండియా. 18 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) సిరీస్‌లో ఫైనల్ ఆడిన జట్టులో రెండు మార్పులు చేసి ఈ బృందాన్ని ఎంపిక చేసింది.
సునీత లకారా, జ్యోతి స్థానంలో యువ క్రీడాకారిణులు షర్మిలా దేవి, రీనా ఖోఖార్కు అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకున్న రీనా అధ్భుత పామ్‌లో ఉంది. ఈ పోటీలతో జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయనుంది షర్మిల.
"టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్లో తొలి మూడు స్థానాల్లో నిలవాలనుకుంటున్నాం. అందుకే 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేశాం. ఒలింపిక్ ప్రమాణాల ప్రకారం 16 మందే ఆడతారు." - స్జోర్డ్ మరిజ్నే, భారత మహిళా జట్టు కోచ్.
భారత హాకీ మహిళా జట్టు ఇదే..
గోల్ కీపర్లు: సవిత(వైస్ కెప్టెన్), రజని
డిఫెండర్లు: దీప్ గ్రేస్ ఎక్కా, రీనా ఖోఖార్, గుర్జిత్ కౌర్, సలీమ, నిషా
మిడ్ ఫీల్డర్లు: సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మోనిక, లిలిమా మిన్జ్, నేహా గోయల్
ఫార్వర్డ్ ప్లేయర్లు: రాణి(కెప్టెన్), నవ్‌నీత్ కౌర్, వందన కటారియా, లాల్రెమ్సైనీ, నవజోత్ కౌర్, షర్మిలా దేవి.
ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న భారత్ బలమైన జట్లతో తలపడనుంది. రెండో ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా, చైనా(11), ఆతిథ్య జట్టు జపాన్(14)లతో పోటీపడనుంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు ఈ పోటీ జరగనున్నాయి.
ఇది చదవండి: 'ఎఫ్ఐహెచ్' విజేతగా భారత హాకీ మహిళల జట్టు