కరోనా కట్టడిలో భాగంగా భారత మహిళా హకీ క్రీడాకారిణులు, తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 18 రోజుల పాటు ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొని, రూ.20,01,130లు విరాళాల రూపంలో సేకరించారు. ఈ మొత్తాన్ని దిల్లీకి చెందిన ఉదయ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు అందించనున్నారు. తద్వారా వారు పేదలకు సహాయపడతారు.
ఈ విషయంలో తమకొచ్చిన స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యామని భారత్ హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ చెప్పింది. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని, పేదలకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి.. జట్టు సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలిపింది.
ఈ ఛాలెంజ్లో భాగంగా హాకీ జట్టులోని ప్రతి క్రీడాకారిణి.. మరో 10 మందికి సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్ సవాలు విసరాలి. స్వీకరించిన ప్రతి ఒక్కరూ ఇచ్చిన టాస్క్ పూర్తి చేసి, రూ.100 విరాళమివ్వాలి. ఇప్పటికే పలువురు ప్లేయర్లు, సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు.