ETV Bharat / sports

బంగ్లాదేశ్​ వేదికగా పురుషుల హాకీ ఛాంపియన్స్​ ట్రోఫీ - బంగ్లాదేశ్

పురుషుల హకీ ఛాంపియన్స్​ ట్రోఫీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుందని ఆసియన్​ హాకీ సమాఖ్య వెల్లడించింది. గతేడాది జరగాల్సిన ఈ పోటీలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది అక్టోబర్ 1-9 వరకు నిర్వహించనున్నారు.

Bangladesh to host Men's Hockey Asian Champions Trophy from Oct 1-9
పురుషుల హాకీ ఛాంపియన్స్​ ట్రోఫీ వేదిక బంగ్లాదేశ్​
author img

By

Published : Apr 9, 2021, 10:39 AM IST

పురుషుల హాకీ ఆసియన్ ఛాంపియన్స్​ ట్రోఫీకి ఈసారి బంగ్లాదేశ్​ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని ఆసియన్​ హాకీ సమాఖ్య గురువారం అధికారికంగా ప్రకటించింది. ఢాకా వేదికగా ఈ ఏడాది అక్టోబర్​ 1-9 వరకు జరుగుతాయని వెల్లడించింది.

"కొవిడ్ పరిస్థితుల వల్ల 2020 నవంబర్​లో జరగాల్సిన ఈ ట్రోఫీ.. 2021కి వాయిదా పడింది. సంబంధిత ట్రోఫీ తేదీలను బంగ్లాదేశ్​ హాకీ సమాఖ్య నిర్ణయించింది. బంగ్లా ఆతిథ్యమివ్వనున్న విషయాన్ని ప్రపంచ హాకీ సమాఖ్య ధ్రువీకరించింది."

-ఆసియన్ హాకీ సమాఖ్య.

ఈసారి జరగనున్న ఆరో దఫా పోటీలకు ఢాకాలోని మౌలానా భాషాని జాతీయ హాకీ స్టేడియం వేదికకానుంది. ఈ టోర్నీలో జపాన్, ఇండియా, పాకిస్థాన్, కొరియా, మలేసియా, బంగ్లాదేశ్​లు పాల్గొననున్నాయి.

ఇదీ చదవండి: ఐపీఎల్: ఈ దఫా ఎవరికి దక్కేనో 'ఆరెంజ్​ క్యాప్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.