ETV Bharat / sports

'ధ్యాన్​చంద్​కు భారతరత్న రాకపోవడం ఆశ్చర్యకరం' - అబ్దుల్​ అజీజ్ ఇంటర్యూ

హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్​చంద్ గురించి భారత మాజీ హాకీ ఆటగాడు అబ్దుల్ అజిజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధ్యాన్​చంద్​కు ఇంకా భారతరత్న రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈటీవీ-భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అజిజ్​ మరిన్ని కబుర్లు పంచుకున్నారు.

Abdul Aziz
'ధ్యాన్​చంద్​కు భారతరత్న రాకపోవడం ఆశ్చర్యకరం'
author img

By

Published : Dec 4, 2020, 1:26 PM IST

ఈటీవీ భారత్​తో అబ్దుల్​ అజీజ్ ప్రత్యేక ఇంటర్యూ

హాకీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మేజర్​ ధ్యాన్​చంద్. భారత్​కు వరుసగా 1928, 1932,1936 ఒలింపిక్స్​లో స్వర్ణం తెచ్చిన దిగ్గజం ఆయన. 'హాకీ విజర్డ్​'గా బిరుదు పొందిన ధ్యాన్​చంద్ 41 వర్ధంతి (గురువారం) సందర్భంగా.. మాజీ హాకీ ఆటగాడు అబ్దుల్​ అజిజ్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..

గురువారం ధ్యాన్​చంద్​ 41వ వర్ధంతి. ఆయనను మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు?

ధ్యాన్​చంద్ హాకీ దిగ్గజం. ఆయన భారత్​ కోసం వరుసగా మూడు ఒలింపిక్ స్వర్ణాలు గెలిచారు. ప్రతి ఒక్కరికీ ఆయన గుర్తుండిపోతారు. దేశం గర్వపడేలా చేసిన వ్యక్తి ఆయన.

ఆయనతో మీకున్న అనుభవాలేంటి?

1975లో ధ్యాన్​చంద్​ తనయుడు అశోక్​ ధ్యాన్​చంద్ సారథ్యంలో భారత్​ హాకీ ప్రపంచకప్​ గెలిచింది. అప్పుడు ఝూన్సీలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. మానాన్న హాకీ ఆటగాడు కనుక అశోక్​ గారిని కలిసే అవకాశం నాకు లభించింది. అప్పడే నేను 'హాకీ దిగ్గజాన్ని' చూశా. నువ్వేం అవుతావ్ అని ధ్యాన్​ చంద్​ నన్ను అడిగారు. అప్పుడు నేను హాకీ ఆడతా అని చెప్పా. ఝూన్సీ పేరు నిలబెట్టాలని చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పారు.

ధ్యాన్​చంద్​ ప్రాంతం నుంచి వచ్చి మీరూ ఆటగాడిగా ఎదిగారు. మరి ఆ ప్రాంతం ఇంకా ధ్యాన్​చంద్​ను స్మరించుకుంటోందా?

ఒకప్పుడు హాకీ ఆట అంటే ఒక సంచలనం. ఇప్పుడు ఆ దాఖలాలు కనిపించడంలేదు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు సొంత లాభాల కోసం ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. ధ్యాన్​చంద్​ హాకీకే కాదు ఇతర ఆటగాళ్లకూ ఆదర్శంగా నిలిచారు. అందరి నుంచి గౌరవం పొందారు. మా ప్రాంతానికి ఝూన్నీ రాణి లక్ష్మీభాయి ఒక ఎత్తు అయితే మేజర్ ధ్యాన్​చంద్​ మరో ఎత్తు.

2013లో సచిన్​కు భారతరత్న లభించడంపై మీ అభిప్రాయం ఏమిటి?

భారతరత్న పురస్కారానికి ముందు మీడియా ఓ సర్వే నిర్వహించింది. మేజర్​ ధ్యాన్​చంద్​కే భారతరత్న ఇవ్వాలని ప్రజలందరూ అభిప్రాయపడ్డారని ఆ సర్వేలో తేలింది. కానీ, ప్రభుత్వ వ్యూహం ఎలా ఉందో తెలియదు. సచిన్​కు భారత​రత్న ఇచ్చింది. ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. మీడియా ఇప్పటికీ ధ్యాన్​చంద్​కు అత్యున్నత పురస్కారం రావాలని ప్రభుత్వానికి గుర్తుచేస్తోంది.

ఇదీ చదవండి:ఐపీఎల్​ ఫ్రాంచైజీ రేసులో అహ్మదాబాద్, కాన్పూర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.