ఇటీవలే అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియొనెల్ మెస్సి(Lionel Messi)ని అధిగమిస్తూ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించాడు భారత స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి(Sunil Chhetri). దీంతో ఫుట్‌బాలర్‌గా ప్రపంచస్థాయిలో 11వ స్థానానికి(Sunil Chhetri rank) చేరుకున్నాడు. మెస్సి 144 మ్యాచ్‌ల్లో 72 గోల్స్ చేస్తే.. ఛెత్రి 117 మ్యాచ్‌ల్లోనే అతడి కంటే రెండు గోల్స్ ఎక్కువ చేయడం విశేషం. అయితే గోల్స్‌లో లయొనెల్ను అధిగమించినప్పటికీ.. తనకు మెస్సి ఎప్పుడూ ఆరాధ్య ఆటగాడే అని అంటున్నాడు. మెస్సితో తనకు పోలికే లేదని.. మెస్సి ఆట చూస్తే తనలో హుషారు పుడుతుందని ఛెత్రి చెప్పాడు.
"ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిలాగే మెస్సీకి నేనూ పెద్ద అభిమానిని. నేనెప్పుడు బాధలో ఉన్నా సరే.. మెస్సి వీడియోలు చూసి ఉత్సాహం తెచ్చుకుంటా. మెస్సిని ఎప్పుడు కలిసినా అతడికి చక్కగా కరచాలనం చేసి నేను తన అభిమానినని చెప్పాలనుకుంటున్నా. అంతకుమించి మెస్సిని ఇబ్బందిపెట్టను. అతణ్ని కలిస్తే సంతోషం. కలవకపోయినా పర్వాలేదు" అని ఛెత్రి అన్నాడు.
ఇదీ చూడండి.. FIFA Worldcup: భారత్ విజయం.. ఛెత్రి అదరహో