ETV Bharat / sports

రొనాల్డో, మెస్సీ.. ఇద్దరిలో బెస్ట్ ఎవరు?

ప్రపంచ ఉత్తమ ఫుట్​బాల్​ ఆటగాడు పురస్కారానికి పది మంది క్రీడాకారుల పేర్లను నామినేట్ చేసింది ఫిఫా. సెప్టెంబర్​ 23న మిలాన్​లో జరగనున్న అవార్డుల వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందించనుంది.

author img

By

Published : Aug 1, 2019, 10:54 AM IST

ఫిఫా

ఈ ఏడాది మేటి ఫుట్​బాల్ ఆటగాడు పురస్కారానికి పది మంది క్రీడాకారులను నామినేట్​ చేసింది అంతర్జాతీయ ఫుట్​బాల్ ఫెడరేషన్(ఎఫ్​ఐఎఫ్​ఏ). ఇందులో పోర్చుగల్​ వీరుడు క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ ఉన్నారు. ఉత్తమ ఆటగాడు ఎవరనేది సెప్టెంబర్ 23న మిలాన్​లో జరిగే ఫిఫా అవార్డుల వేడుకల్లో ప్రకటిస్తారు.

ప్రత్యర్థులుగా మైదానంలో అమీతుమీ తేల్చుకునే రొనాల్డో, మెస్సీల్లో ఉత్తమ ఆటగాడిగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాంచెస్టర్ సిటీ స్టార్​గా గుర్తింపు పొందిన పొర్చుగల్ ఆటగాడు బెర్నార్డో సిల్వాకు ఈ జాబితాలో చోటుదక్కకపోవడం గమనార్హం.

FIFA
బెర్నార్డో సిల్వా

యూఈఎఫ్​ఏ ఛాంపియన్ లివర్​పూల్​ జట్టు ఆటగాళ్లు సాడియో మేన్, హ్యారీ కేన్, కైలియాన్ నామినేటెడ్​ లిస్టులో ఉన్నారు. మహిళల జాబితాలో అమెరికన్ స్ట్రైకర్ మెగన్ రాపినోయి, అలెక్స్ మోర్గాన్, జూలీ ఎట్జ్​ లాంటి స్టార్​ ప్లేయర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

జాతీయ జట్ల సారథులు, కోచ్​లు, ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులు, అభిమానుల ఓట్ల ద్వారా ప్రపంచ ఉత్తమ ఆటగాడిని ఎంపిక చేస్తుంది ఫిఫా. ఒక్కొక్కరికి 25 శాతం ఓట్ల వెయిటేజీ ప్రకారం ఈ ఏటి మేటి క్రీడాకారుడు ఎవరో తేల్చనుంది.

ఇది చదవండి: మయాంక్​ను వదులుకున్న ముంబయి ఇండియన్స్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.