ETV Bharat / sports

బార్సిలోనాతోనే మెస్సీ.. వేతనంలో కోతకూ సిద్ధం! - లియోనాల్డ్ మెస్సీ

అర్జెంటినా ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీ.. స్పానిష్​ క్లబ్​ బార్సిలోనాతో మరోసారి కాంట్రాక్ట్​ కుదుర్చుకోనున్నాడని సమాచారం. ఇందుకోసం సగం వేతనాన్ని తగ్గించుకోనున్నాడని స్థానిక మీడియా ప్రచురించింది.

Lionel Messi
లియోనాల్డ్ మెస్సీ
author img

By

Published : Jul 15, 2021, 10:40 AM IST

Updated : Jul 15, 2021, 11:53 AM IST

స్పానిష్​ క్లబ్​ బార్సిలోనాతో అర్జెంటినా ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సీ మరో కొత్త కాంట్రాక్ట్​ కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త డీల్​లో భాగంగా మెస్సీ.. వేతనంలో 50 శాతం కోతకు సిద్ధమయ్యాడని స్థానిక మీడియా ప్రచురించింది. ఈ మేరకు బార్సిలోనా క్లబ్​ త్వరలోనే ప్రకటన చేయనుందని సమాచారం.

2004 నుంచి మెస్సీ బార్సిలోనా క్లబ్​తోనే ఉన్నాడు. ఈ ఏడాది జూన్​తో అతడి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. దీంతో మరో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ బార్సిలోనాతో కాంట్రాక్ట్​ కుదిరితే.. 2026 వరకు అది కొనసాగుతుంది. అప్పటికి మెస్సీ వయసు 39 ఏళ్లకు చేరుకుంటుంది. గత ఐదేళ్ల ఒప్పందంలో కోపా అమెరికా టైటిల్​ గెలుచుకున్న మెస్సీ.. ఇప్పటికే రూ. 4.85 వేలకోట్లను సంపాదించాడు.

ఇదీ చదవండి: బీడీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీనా?

Last Updated : Jul 15, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.