ETV Bharat / sports

మెస్సీ వాడిన టిష్యూ పేపర్​కు ఏడున్నర కోట్లా? - మెస్సీ వాడిన టిష్యూ పేపర్​ వేలం

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనల్‌ మెస్సీ.. బార్సిలోనా క్లబ్‌ను వీడే సమయంలో భావోద్వేగంతో కంటనీరు పెట్టిన దృశ్యం గుర్తుందా? ఆ సమయంలో మెస్సీ ఉపయోగించిన టిష్యూ పేపర్ ప్రస్తుతం వేలానికి వచ్చింది. ఈ వేలంలో దానికి లభించిన ధర తెలిస్తే షాక్ అవుతారు.

రూ.ఏడున్నర కోట్ల ఆ టిష్యూ పేపర్‌!
రూ.ఏడున్నర కోట్ల ఆ టిష్యూ పేపర్‌!
author img

By

Published : Aug 18, 2021, 4:03 PM IST

దిగ్గజ ఫుట్​బాల్​ ప్లేయర్​ లియోనల్​ మెస్సీ కన్నీరు పెట్టిన సమయంలో ఉపయోగించిన టిష్యూ పేపర్​ను ఓ వ్యక్తి వేలానికి పెట్టాడు. ఈ వేలంలో ఆ టిష్యూకు ఏకంగా రూ.7.4 కోట్ల రూపాయల ధర పలికింది. బార్సిలోనా ఫుట్​బాల్​ క్లబ్​కు ప్రాతినిధ్యం వహించిన అతడు ఆ క్లబ్​కు వీడ్కోలు పలికే సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు. సుదీర్ఘకాలంపాటు ఆ క్లబ్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మెస్సీ ఏడ్చేయడం అభిమానులను కలచివేసింది.

ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకున్న మెస్సీ.. ముక్కును కూడా ఆ టిష్యూ పేపర్​తోనే తుడుచుకున్నాడు. అతను ఆరోజు వాడి పారేసిన టిష్యూ పేపర్​ను సేకరించిన ఓ వ్యక్తి 'ఎమ్‌ఈకెడో' అనే వెబ్​సైట్​లో వేలానికి పెట్టాడు. దీని ప్రారంభ ధరను ఏకంగా రూ.7.4కోట్లుగా నిర్ణయించాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.