మెస్సీ, రొనాల్డో ఫుట్‌బాల్ ఆటలో పేరుగాంచిన ఆటగాళ్లు. మైదానంలో ప్రత్యర్థులుగా ఎదురుపడితే అభిమానులకు దానికి మించిన కిక్ ఉండదు. ఈ ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఇద్దరినీ ఒకే వేదికపై నిలబెట్టింది యూఈఎఫ్ఎ (యూనియన్ ఆఫ్ యురోపియన్ ఫుట్‌బాల్ ఫర్ అసోసియేషన్) అవార్డుల ప్రదానోత్సవ వేడుక.
ఈ కార్యక్రమంలో మెస్సీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు రొనాల్డో. తనతో కలిసి డిన్నర్ చేయాలనుందని వెల్లడించాడు. అయితే ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు మెస్సీ.
" అతడితో కలిసి డిన్నర్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. రొనాల్డోతో నాకెలాంటి గొడవలు లేవు. ఇప్పటివరకూ మేమిద్దరం కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కుదరలేదు కాబట్టి స్నేహితులు కాలేకపోయాం. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో తనని ఎప్పుడు చూసినా నాకెలాంటి శత్రుత్వం కనపడదు".
-- మెస్సీ, ఫుట్‌బాల్ ఆటగాడు
రొనాల్డో డిన్నర్ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పాడు లియోనల్ మెస్సీ.
" ఇటీవల జరిగిన కార్యక్రమంలో మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తామో లేదో తెలియదు. ఎందుకంటే అతడికీ.. నాకూ అనేక కారణాలు ఉండొచ్చు. ఇద్దరికీ వ్యక్తిగత జీవితంతో పాటు కమిట్మెంట్లూ ఉంటాయి. అయితే అతడి కోరికని మాత్రం అంగీకరిస్తాను" అని మెస్సీ చెప్పుకొచ్చాడు.
డిన్నర్ చేస్తావా మిత్రమా...!
ఈ ఏడాది ఆగస్టులో యూఈఎఫ్ఎ (యూనియన్ ఆఫ్ యురోపియన్ ఫుట్‌బాల్ ఫర్ అసోసియేషన్) అవార్డుల ప్రదానోత్సవంలో మెస్సీ గురించి రొనాల్డో మాట్లాడాడు. 15 ఏళ్లుగా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నా... ఇప్పటివరకు కలిసి డిన్నర్ చేయలేదని చెప్పాడు. భవిష్యత్తులో కచ్చితంగా ఆ అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెస్సీతో పోటీపడి ఆడటం వల్లే తాను అత్యుత్తమ ఆటగాడిగా తయారయ్యానని చెప్పాడు రొనాల్డో.
-
Leo Messi was the top scorer in last season's UEFA Champions League with 12 goals, the first season that Cristiano Ronaldo did not scoop the award since 2012 ⚽️
— SuperSport (@SuperSportTV) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Ronaldo spoke about their rivalry at the #UCLDraw and whether the two have made any dinner plans 🍽️😂 pic.twitter.com/ax4nKw5y5A
">Leo Messi was the top scorer in last season's UEFA Champions League with 12 goals, the first season that Cristiano Ronaldo did not scoop the award since 2012 ⚽️
— SuperSport (@SuperSportTV) August 30, 2019
Ronaldo spoke about their rivalry at the #UCLDraw and whether the two have made any dinner plans 🍽️😂 pic.twitter.com/ax4nKw5y5ALeo Messi was the top scorer in last season's UEFA Champions League with 12 goals, the first season that Cristiano Ronaldo did not scoop the award since 2012 ⚽️
— SuperSport (@SuperSportTV) August 30, 2019
Ronaldo spoke about their rivalry at the #UCLDraw and whether the two have made any dinner plans 🍽️😂 pic.twitter.com/ax4nKw5y5A
యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా 2012 నుంచి రొనాల్డో అవార్డు తీసుకుంటున్నాడు. గతేడాది జరిగిన టోర్నీలో 12 గోల్స్ చేసిన మెస్సీ... టాప్ స్కోరర్‌గా నిలిచి ఆ ట్రెండ్ బ్రేక్ చేశాడు.
ఇదీ చూడండి...