ETV Bharat / sports

మ్యాక్సీ కొట్టిన గోల్​ చిరస్మరణీయం.. అంతా క్షణాల్లోనే! - 2006 ఫుట్​బాల్​ ప్రపంచకప్‌లో మ్యాక్సీ రోడ్రిగ్జ్‌ కొట్టిన గోల్

జర్మనీలో జరిగిన 2006 ఫుట్​బాల్​ ప్రపంచకప్‌లో మ్యాక్సీ రోడ్రిగ్జ్‌ కొట్టిన గోల్​ అత్యుత్తమంగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్​ విశేషాలు మీకోసం...

Maxi Rodriguez's goal at the 2006 Football World Cup in Germany was the best goal ever.
అతడు కొట్టిన గోల్​ చిరస్మరణీయం
author img

By

Published : May 3, 2020, 7:36 AM IST

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు పేరు వినగానే అప్పట్లో మారడోనా గుర్తుకువచ్చేవాడు. ఇప్పుడైతే అంతా మెస్సి నామజపం చేస్తున్నారు. కానీ ఆ జట్టు తరపున ఆడుతూ.. ప్రపంచకప్‌ల్లో అత్యుత్తమం అనదగ్గ వాటిలో ఓ గోల్‌ చేసిన ఆటగాడు మ్యాక్సీ రోడ్రిగ్జ్‌. జర్మనీలో జరిగిన 2006 ప్రపంచకప్‌లో అతను ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రిక్వార్టర్స్‌లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన గోల్‌ చిరస్మరణీయం. ఆ మ్యాచ్‌లో మెస్సి కూడా ఆడాడు. రెండు జట్లు హోరాహోరీగా తలపడడం వల్ల నిర్ణీత సమయం ముగిసే సరికి స్కోరు 1-1తో సమమైంది.

దాంతో అదనపు సమయం కేటాయించి మ్యాచ్‌ను కొనసాగించారు. 98వ నిమిషంలో మ్యాక్సీ అసాధరణ రీతిలో చేసిన గోల్‌ జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. అప్పటికే ప్రత్యర్థి పెనాల్టీ ప్రాంతంలోకి అతను చొచ్చుకొచ్చాడు. అతణ్ని గమనించిన కెప్టెన్‌ పాబ్లో దాదాపు 40 గజాల దూరం నుంచి బంతిని నేరుగా అతని వైపు తన్నాడు. పై నుంచి పడుతున్న బంతిని ఛాతితో అద్భుతంగా నియంత్రించిన అతను.. అడ్డుకోవడానికి వస్తున్న ప్రత్యర్థి ఆటగాడు తనను అందుకునేలోపే గాలిలో ఉన్న బంతిని ఎడమకాలితో గోల్‌కీపర్‌ తలమీదుగా గోల్‌పోస్టులోకి పంపించేశాడు.

గోల్‌పోస్టులో పడుతున్న బంతిని చూడడం తప్ప ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమీ చేయలేకపోయారు. అర్జెంటీనా అభిమానులు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. అయితే ఈ గోల్‌ గురించి అంతగా చెప్పుకోవడానికి ఏం ప్రత్యేకత ఉంది అని అనిపించవచ్చు. పై నుంచి పడుతున్న బంతిని ఛాతితో ఆపడమే కాకుండా అది కిందపడేలోపే దాన్ని సరిగ్గా గోల్‌పోస్టులోకి తన్నాలి అంటే ఊహించినంత సులభం కాదు. అందుకే ఇది అత్యుత్తమ గోల్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది.

Maxi Rodriguez's goal at the 2006 Football World Cup in Germany was the best goal ever.
మ్యాక్సీ రోడ్రిగ్జ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.