ETV Bharat / sports

మేరీకోమ్ నాకు చాలా విషయాల్లో స్ఫూర్తి: బాలా దేవి - 2014 ఆసియా క్రీడలు

స్టార్ బాక్సర్ మేరీకోమ్​ను ప్రశంసించిన ఫుట్​బాలర్ బాలా దేవి.. దేశం తరఫున ఆమె ఎన్నో రికార్డులు సృష్టిస్తోందని చెప్పింది. తన నుంచి చాలా స్ఫూర్తి పొందానని తెలిపింది.

Mary Kom a big source of inspiration for me: Bala
మేరీకోమ్ నాకు చాలా విషయాల్లో స్ఫూర్తి: బాలా దేవి
author img

By

Published : Dec 12, 2020, 7:14 PM IST

ప్రముఖ బాక్సర్​ మేరీకోమ్ నుంచి చాలా విషయాల్లో స్ఫూర్తి పొందానని భారత మహిళా స్టార్ ఫుట్​బాలర్​ బాలాదేవి చెప్పింది. 2014 ఆసియా క్రీడల సందర్భంగా ఆమెతో మాట్లాడిన క్షణాల్ని గుర్తు చేసుకుంది.

Bala devi footballer
భారత స్టార్ ఫుట్​బాలర్ బాలా దేవి

"మేరీకోమ్ నాకెన్నో విషయాల్లో స్ఫూర్తి. ఎలాంటి వసతులు లేని చోటు నుంచి వచ్చి శ్రమ, పట్టుదలతో ఎన్నో రికార్డులు సృష్టించింది. తల్లి అయిన తర్వాత కూడా ఆ రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. మేం 2014 ఆసియా క్రీడల సమయంలో కలిశాం. అప్పుడే ఆమె శిక్షణ విధానాన్ని చూశాను. ఎంతో స్నేహంగా ఉండే మేరీ.. మా పోటీలప్పుడు చాలా సహాయం చేశారు" -బాలా దేవి, ప్రముఖ ఫుట్​బాలర్

స్కాట్లాండ్​ ఉమెన్ ప్రీమియర్​ లీగ్​లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత తొలి మహిళా ఫుట్​బాలర్​గా బాలాదేవి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరిలో ఆ లీగ్​లోని రేంజర్స్ జట్టుతో 18 నెలల ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అలానే ఏఎఫ్​సీ ఇంటర్నేషనల్​ ప్లేయర్​ ఆఫ్ ది వీక్​ నామినేషన్లలోనూ స్టార్ ప్లేయర్ల సరసన చోటు దక్కించుకుంది. అయితే తన ఎదుగుదలలో ఆల్ ఇండియా ఫుట్​బాల్ ఫెడరేషన్​ కీలక పాత్ర పోషించిందని బాలా దేవి చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.