ETV Bharat / sports

20 ఏళ్ల బంధానికి ఫుట్​బాలర్ మెస్సీ ముగింపు! - స్టార్ ఫుట్​బాలర్ మెస్సీ

దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్​కు ఆడుతున్న మెస్సీ.. ఇప్పుడు వారి నుంచి విడిపోవాలని భావిస్తున్నాడు. సదరు యాజమాన్యానికి ఈ విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా తెలిపాడు.

20 ఏళ్ల బంధానికి ఫుట్​బాలర్ మెస్సీ వీడ్కోలు
ఫుట్​బాలర్ మెస్సీ
author img

By

Published : Aug 26, 2020, 9:20 AM IST

Updated : Aug 26, 2020, 9:29 AM IST

ఎఫ్​సీ బార్సిలోనాతో ఉన్న 20 ఏళ్ల బంధానికి స్టార్ ఫుట్​బాలర్ లియో మెస్సీ ముగింపు పలకాలని భావిస్తున్నాడు. సదరు యాజమాన్యానికి ఫ్యాక్స్ కూడా పంపాడు. అయితే కాంట్రాక్ట్​లో ఉన్న నిబంధనను సడలించి, తనకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని పేర్కొన్నాడు. క్లబ్ మాత్రం, మెస్సీ తన కెరీర్​ చివరి వరకు తమతోనే ఉండాలని కోరుకుంటోంది.

leo messi
స్టార్ ఫుట్​బాలర్ లియో మెస్సీ

2000లో బార్సిలోనాలో చేరిన మెస్సీ.. ఇప్పటివరకు 10 లాలిగా టైటిల్స్​తో పాటు నాలుగుసార్లు యూఈఎఫ్​ఏ ఛాంపియన్స్ లీగ్​ టైటిల్​ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఫార్వర్డ్​గా ఎన్నో గోల్స్ కొట్టి క్లబ్ విజయాల్లో భాగమయ్యాడు. ఆరుసార్లు గోల్డెన్ బూట్​ను సొంతం చేసుకున్నాడు.

Lionel Messi Barcelona
బార్సిలోనాలో ఉండి మెస్సీ సాధించిన రికార్డులు

2007-08 తర్వాత బార్సిలోనాకు ప్రస్తుత సీజన్ క్లిష్టంగా సాగుతోంది. ఇటీవలే బాయర్న్ మ్యూనిచ్​ క్లబ్ చేతిలో 8-2 తేడాతో ఓడింది బార్సిలోనా. ఈ మ్యాచ్​ జరిగిన 11 రోజుల తర్వాతే మెస్సీ, క్లబ్​తో తెగదెంపులు చేసుకోవాలనుకుని అనుకుంటున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 26, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.