ETV Bharat / sports

Messi Birthday: టిష్యూ పేపర్​పైనే కాంట్రాక్టు సంతకం! - Lionel Messi

లియోనల్​ మెస్సీ.. ఫుట్​బాల్​ గురించి తెలిసినవారికి పరిచయం అక్కర్లేని పేరు. అతని ఆట, వ్యక్తిక్తంతో ఫుట్​బాల్​ ప్రపంచంలోని అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. తన సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు. అర్జెంటీనా జాతీయ జట్టుతో పాటు స్పానిష్​ లీగ్​లో కెరీర్​ ఆసాంతం బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించాడు. గురువారం(జూన్ 24) అతడి పుట్టినరోజు సందర్భంగా.. మెస్సీ జీవిత విశేషాల గురించి ప్రత్యేక కథనం.

Messi Birthday
మెస్సీ పుట్టినరోజు
author img

By

Published : Jun 24, 2021, 12:57 PM IST

Updated : Jun 24, 2021, 3:49 PM IST

ఫుట్​బాల్​ ఆటగాళ్లంటే మొదట గుర్తొచ్చే పేర్లు.. మెస్సీ, రొనాల్డో. తమ ఆటతో.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. రొనాల్డో కంటే ఓ మెట్టుపైనే ఉంటాడు అర్జెంటీనా దిగ్గజం, బార్సిలోనా స్టార్​ లియోనల్​ మెస్సీ. రొనాల్డోకు సాధ్యం కాని ఎన్నో ఘనతల్ని సాధించి.. సాకర్​లో రారాజుగా పేరు గడించాడు. గురువారం(జూన్ 24) 34వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. మెస్సీ జీవిత విశేషాలు మీకోసం.

లియోనల్​ మెస్సీ.. 1987 జూన్​ 24న అర్జెంటీనా రోసారీలో జన్మించాడు. దేశ జాతీయ ఫుట్​బాల్ జట్టుకు​ ఆడుతున్నప్పటికీ.. స్పానిష్​ ఫుట్​బాల్​ క్లబ్​ బార్సిలోనాతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. ఆ క్లబ్​తో అతడికి విడదీయరాని అనుబంధం ఉంది.

Lionel Messi Birthday
రికార్డుల రారాజు మెస్సీ

వైద్యం ఖర్చులు భరించి..

11 ఏళ్ల వయసులో హార్మోన్​ లోపం అతడిని ఇబ్బంది పెట్టింది. చికిత్స కోసం నెలకు 900 డాలర్లు కట్టాలి. ఆ సమయంలో.. ఫుట్​బాల్​ క్లబ్​ బార్సిలోనా కాంట్రాక్టుపై సంతకం చేస్తేనే వైద్యానికి డబ్బులు వస్తాయి. ఏం ఆలోచించకుండా.. కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. అతని వైద్యానికి అయిన ఖర్చులను క్లబ్​ చెల్లించింది.

2003లో తొలిసారి బార్సిలోనా క్లబ్​ (స్పెయిన్​)తరఫున అరంగేట్రం చేశాడు. అప్పుడతని వయసు 17 ఏళ్లే.

2017లో ఆంటోనెల్లా రోకుంజోను వివాహం చేసుకున్న మెస్సీకి.. ముగ్గురు కుమారులు.

Lionel Messi Birthday
లియోనల్​ మెస్సీ

మెస్సీ ఘనతలు..

  • ఫుట్​బాల్​లో​ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నాలుగు అవార్డులు( బాలన్​ డీ ఓర్​, ఫిఫా వరల్డ్​ ప్లేయర్​, పిచిచీ ట్రోఫీ, గోల్డెన్​ బూట్​) అందుకున్న ఏకైక ఆటగాడు మెస్సీ. 2009-10 సీజన్​లో ఇది సాధించాడు.
  • అత్యుత్తమ ఫుట్​బాల్​ ఆటగాడికి ఇచ్చే బాలన్​ డీ ఓర్​ను అవార్డును ఏకంగా ఆరుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు. 2009,10,11,12,15,19లలో దీనిని సొంతం చేసుకున్నాడు. పోర్చుగల్​ స్టార్​ క్రిస్టియానో రొనాల్డో 5 సార్లు సాధించి.. మెస్సీ వెనుక ఉన్నాడు.
  • యూరో లీగ్​లో అత్యధిక గోల్స్​ చేసిన ఆటగాడికిచ్చే గోల్డెన్​ షూను కూడా ఆరుసార్లు పొందిన ఏకైక ఆటగాడు మెస్సీనే.
  • ఒక క్యాలెండర్​ ఇయర్​లో ఎక్కువ గోల్స్​ చేసిన ఆటగాడు మెస్సీనే. 2012లో లా లిగా ఫుట్​బాల్​ లీగ్​లో 59, ఛాంపియన్స్​ లీగ్​లో 13, జాతీయ జట్టు తరఫున 12, ఇతర టోర్నీల్లో 7 ఇలా మొత్తం 91 గోల్స్​ చేశాడు.
  • ఒక క్లబ్​ తరఫున ఎక్కువ గోల్స్​ చేసింది మెస్సీనే. బార్సిలోనాకు ఆడుతూ.. ఇప్పటివరకు 672 గోల్స్​ చేశాడు. బ్రెజిల్​ లెజెండ్​ పీలేనే(643) అధిగమించాడు. చిన్న వయసులో తొలి గోల్​, 100వ గోల్​, 200వ గోల్​ చేసింది మెస్సీనే.
    Lionel Messi Birthday
    ఆరుసార్లు బాలన్​ డీ ఓర్​ అవార్డు

మెస్సీ గురించి చాలా మందికి తెలియనివి..

  • మైదానంలో మెస్సీ వేగం, చురుకుదనం కారణంగా.. అతడిని 'ది ఫ్లీ' అని కూడా పిలుస్తుంటారు.
  • ప్రపంచ ఫుట్​బాల్​ ఆటగాళ్లలో అత్యంత ధనవంతుడు మెస్సీనే. అతని ఆస్తి 126 మిలియన్​ డాలర్లు.
  • ఆటతోనే కాకుండా.. ఎన్నో ఉదార కార్యక్రమాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.
  • తొలిసారి మెస్సీ నైపుణ్యాలు, ఆటను మెచ్చిన బార్సిలోనా డైరెక్టర్​ కార్లెస్​ రియాచ్​.. వెంటనే కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. అప్పట్లో పేపర్​ అందుబాటులో లేకుంటే టిష్యూ పేపర్​పైనే కాంట్రాక్ట్​ సంతకం చేశాడు.
  • బార్సిలోనా తరఫున అత్యంత చిన్న వయసులో(17) గోల్స్​ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
  • ఇతనికి రెండు పాస్​పోర్ట్​లున్నాయి. అర్జెంటీనా సహా స్పెయిన్​లో అతడికి పౌరసత్వం ఉంది.
  • బ్రెజిల్​ దిగ్గజ ఫుట్​బాల్​ ఆటగాడు.. రొనాల్డినో నుంచి 2008లో జెర్సీ నెం.10ను పొందాడు.
  • 2009లో తొలిసారి ఫిఫా వరల్డ్ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డు అందుకున్నాడు.
  • అర్జెంటీనా జాతీయ జట్టుకు ఆడే మెస్సీని.. స్పెయిన్​ తరఫున ఆడాలని ఆ దేశం కోరినా సున్నితంగా తిరస్కరించాడు.
  • పిల్లలకు మంచి విద్య, వైద్య సదుపాయాల కోసం.. లియో మెస్సీ అనే ఫౌండేషన్​ను స్థాపించాడు.
  • యూనిసెఫ్​ గుడ్​విల్​ అంబాసిడర్​గానూ ఉన్నాడు మెస్సీ.

అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఫుట్​బాల్​ ప్రపంచకప్​ను మాత్రం ముద్దాడలేకపోయాడు మెస్సీ. ఇదొక్కటి సాధిస్తే.. అతని కెరీర్​ పరిపూర్ణం అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఇవీ చదవండి: బుమ్రా బౌలింగ్​ సీక్రెట్​పై ఐసీసీ వీడియో

Dravid: పార్ట్​టైమ్​ బౌలర్​గా ద్రవిడ్.. మీకు తెలుసా?​

Cricket: ఏడు ఐసీసీ టోర్నీలు.. ప్రతిసారి కొత్త విజేతనే

Last Updated : Jun 24, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.