లాక్‌డౌన్‌లో వివిధ రకాల విధులను నిర్వర్తిస్తున్న క్రీడాకారులను చూశాం. తాజాగా మహిళల సీనియర్ ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలు ఇందుమతి వారి జాబితాలో చేరింది. ఆమె భారత జట్టుకు ఆడుతూనే తమిళనాడు పోలీసు శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించింది. లాక్‌డౌన్ సమయంలో ఆటల్లేకపోవడం వల్ల పోలీసు విధులకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే ఖాకీ దుస్తులు ధరించి, మాస్క్ పెట్టుకుని, చేతికి గ్లవ్స్ వేసుకుని.. చెన్నైలోని అన్నా నగర్‌లో విధులు నిర్వర్తిస్తోంది. "ఓ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా సమయం ఉండదు. కానీ జనాల్లో చైతన్యం తేవడానికి ఇదే సరైన తరుణం" అని ఈ మిడ్‌ఫీల్డర్ చెప్పింది.
![Indian women team's footballer Indumathi Kathiresan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/saff-womens-games-450x320_2705newsroom_1590548021_961.jpg)
![Indian women team's footballer Indumathi Kathiresan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7361392_indhumathi.jpg)