క్రికెట్ ప్రపంచకప్‌కు హాట్‌ఫేవరెట్ అయిన భారత్... ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు మాత్రం అర్హత సాధిస్తే చాలు అంటుంటారు చాలామంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. 2022 ఫిఫా ప్రపంచకప్ అర్హత పోటీల కోసం ఆసియా దేశాల ఎంపికకు తీసిన డ్రాలో భారత్‌కు చోటు దక్కింది. 40 ఆసియా దేశాలను 8 గ్రూపులుగా విభజించగా.. ఇండియాకు గ్రూప్- ఈలో అవకాశం దక్కింది. గ్రూప్ - ఈలో ఖతార్, ఒమన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ జట్లతో పోటీపడనుంది భారత్. ఇందులో విజేతగా నిలిస్తే ఖతార్‌లో జరిగే 2022 ప్రపంచకప్ తుది అర్హత పోటీలకు ఎంపిక అవుతుంది భారత్.
ఫైనల్ క్వాలిఫైయింగ్ పోటీల్లో ముందు వరుసలో ఉంటే అప్పుడు 2022 సాకర్ ప్రపంచకప్‌లో భారత్‌కు చోటు దక్కుతుంది. అంతేకాకుండా చైనాలో 2023లో జరగనున్న ఆసియా కప్ క్వాలిఫైయింగ్ ఫైనల్‌కూ అర్హత లభిస్తుంది.
జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇరాక్, ఉజ్బెకిస్థాన్ వంటి మేటి జట్లు ఉన్న గ్రూపులో పడకపోవడం వల్ల ఇండియాకు కలిసొచ్చే అవకాశముంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 2020 జూన్ 9 వరకు ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ విజేతలతో పాటు నలుగురు రన్నరప్స్ కలిపి మొత్తం 12 జట్లను తదుపరి రౌండ్‌కు పంపిస్తారు.
8 గ్రూపుల్లోని జట్లు ఇవే..
- గ్రూప్ - ఎ: చైనా, సిరియా, ఫిలిప్పీన్స్, మాల్దీవులు, గువామ్
- గ్రూప్ - బి: ఆస్ట్రేలియా, జోర్డాన్, చైనీస్ తైపీ, కువైట్, నేపాల్
- గ్రూప్ - సి: ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, హాంకాంగ్, కాంబోడియా
- గ్రూప్ - డి: సౌదీ అరేబియా, ఉజ్బెకిస్థాన్, పాలస్తీనా, యెమెన్, సింగపూర్
- గ్రూప్ - ఈ: బంగ్లాదేశ్, ఒమన్, భారత్, ఆఫ్గానిస్థాన్, ఖతార్
- గ్రూప్ - ఎఫ్: జపాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, మయన్మార్, మంగోలియా
- గ్రూప్ - జి: యుఏఈ, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా
- గ్రూప్ - హెచ్: కొరియా రిపబ్లిక్, లెబనాన్, కొరియా డీపీఆర్, తుర్క్మెనిస్థాన్, శ్రీలంక.
ఇది చదవండి: 'స్టోక్స్ ఆ నాలుగు పరుగులు వద్దన్నాడు'