ETV Bharat / sports

'ఆటను ఆస్వాదిస్తున్నా.. ఇప్పట్లో దూరం కాను' - george floyd

ఫుట్​బాల్​ను ఆస్వాదిస్తానని, ఇప్పట్లో ఆటకు దూరం కానని చెప్పాడు ప్రముఖ ఆటగాడు​ సునీల్​ ఛెత్రి. జూన్​ 12తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి మాట్లాడాడు.

sunil chhetri
'ఆటను ఆస్వాధిస్తున్నా.. ఇప్పట్లో దూరం కాను'
author img

By

Published : Jun 12, 2020, 7:10 AM IST

భారత ఫుట్​బాల్​ ప్లేయర్​ సునీల్​ ఛెత్రి.. తన భవిష్యత్తు కెరీర్​ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ప్రస్తుతం ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని, ఇప్పట్లో రిటైర్​కానని స్పష్టం చేశాడు. "కచ్చితంగా ఇంతకాలం ఆడతానని చెప్పను. కానీ ఇప్పుడు నేను నా ఆటను ఆస్వాదిస్తున్నా. ఇప్పట్లో మాత్రం దూరం కాను. చాలా ఫిట్‌గా ఉన్న భావనతో ఉన్నానని 'నా భార్యతో చెప్పా'. పరుగులో ఉదాంత, ఆషిక్‌ (భారత జట్టు, బెంగళూరు ఎఫ్‌సీలో సహచరులు)లకు సవాలు విసరబోతున్నా. అబ్దుల్‌ సాహాల్‌ మరిన్ని గోల్స్‌ కొట్టి నన్ను తోసేస్తే (జాతీయ జట్టు నుంచి) తప్ప నేను జట్టు తరఫున ఆడుతూనే ఉంటా" అని ఛెత్రి చెప్పాడు.

15 ఏళ్లు పూర్తి

2005లో అరంగేట్రం చేసిన ఛెత్రి.. నేటితో 15 ఏళ్ల కెరీర్​ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు భారత్‌ తరఫున 115 మ్యాచ్‌ల్లో 72 గోల్స్‌ కొట్టాడు. ప్రస్తుత ఫుట్‌బాలర్లలో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (99) తర్వాత అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన ఆటగాడు ఇతడే.

జాతి వివక్ష హానికరం

అఫ్రో- అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మృతిపై స్పందించిన ఛెత్రి.. "జాతి వివక్ష నన్ను బాధిస్తోంది. అయితే దాని గురించి తెలియకుండానే చాలా మంది జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం కలవరపరిచే అంశం. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పట్టుకుని.. అలా ఎందుకు అన్నావని అడిగితే తనకేం తెలియదని చెప్తాడు. రంగు, కులం, మతం పేరుతో తక్కువ చేసి చూడడం సరికాదు. అలా జరగకూడదు" అని ఛెత్రి పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:'ఛెత్రి గొప్ప ఆటగాడే.. మనస్తత్వం మాత్రం పిల్లాడిది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.