2019-20 సీజన్ ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్. ఆదివారం భాగ్యనగరంలో జట్టు జెర్సీని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హీరో వెంకటేశ్ హాజరయ్యాడు. ఇటీవలే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎంపికైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంప్రదాయ నిజాం షేర్వాణీ స్ఫూర్తిగా తీసుకుని, హైదరాబాద్ నగర విశిష్టతను పెంపొందించేలా ఈ జెర్సీని రూపొందించారు.
"హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రారంభమవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సీజన్లో మన జట్టు ప్రత్యర్థులకు గట్టి పోటీదారు అవుతుందని భావిస్తున్నాను. ఫైనల్లో బెంగళూరు, చెన్నైతో తలపడుతుందని అనుకుంటున్నాను(నవ్వుతూ)" -వెంకటేశ్, కథానాయకుడు
స్కూల్‌డేస్‌లో ఎక్కువగా సాకర్ ఆడేవాడినని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్. అయితే ఆ తర్వాత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని చెప్పాడు.
వచ్చే నెల 20 నుంచి ఐఎస్ఎల్ ఆరో సీజన్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఎఫ్‌సి.. 25న కోల్‌కతాలో తొలి మ్యాచ్, నవంబరు 2న హోమ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ ఆడనుందని చెప్పారు జట్టు యజమాని వరుణ్ త్రిపురనేని.
ఇది చదవండి: అత్యుత్తమ గోల్ కన్నా శృంగారమే మిన్న: స్టార్ ఫుట్‌బాలర్ రొనాల్డొ