ETV Bharat / sports

ఇకపై రెండేళ్లకోసారి ఫిఫా ప్రపంచకప్​!

నాలుగేళ్లకోసారి నిర్వహించే ఫిఫా ఫుట్​బాల్ ప్రపంచకప్​ను ఇకపై నుంచి రెండేళ్లకోసారి జరపాలని భావిస్తున్నట్లు ఓ క్రీడా ఛానల్​ వెల్లడించింది. సౌదీ అరేబియా ఫుట్​బాల్ ఫెడరేషన్​ వార్షిక కాంగ్రెస్​లో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది.

author img

By

Published : May 22, 2021, 3:37 PM IST

Updated : May 22, 2021, 5:18 PM IST

fifa world cup, football
ఫిఫా ప్రపంచకప్, ఫుట్​బాల్​

ఫిఫా ఫుట్​బాల్​ ప్రపంచకప్​ను ఇక నుంచి రెండేళ్లకోసారి నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అంశంపై సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా ఫుట్​బాల్ ఫెడరేషన్(ఎస్​ఏఎఫ్​ఎఫ్​)​ వార్షిక కాంగ్రెస్​లో ఈ ప్రతిపాదన గురించి చర్చించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఓ క్రీడా ఛానల్​ నివేదికను వెలువరించింది. తదుపరి పురుషుల ప్రపంచకప్​ ఖతార్​ వేదికగా 2022లో జరగనుండగా.. మహిళల వరల్డ్​కప్​ 2023లో ఆస్ట్రేలియా/న్యూజిలాండ్​లో జరపనున్నారు.

"ఫుట్​బాల్​ భవిష్యత్ క్లిష్ట దశలో ఉందని చెప్పొచ్చు. ఈ విశ్వక్రీడను వేధిస్తున్న సమస్యలకు కొవిడ్ మహమ్మారి తోడైంది. ఇకపై నాలుగేళ్లకోసారి జరగాల్సిన ఈ ఫుట్​బాల్ ప్రపంచకప్​ను రెండేళ్లకోసారి జరపాల్సిన విషయాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు వాణిజ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది" అని ఎస్​ఏఎఫ్​ఎఫ్​ అధ్యక్షుడు యాసీర్​ అల్​ మిషెల్​ తెలిపారు.

ఈ ప్రతిపాదనపై తొందరపడబోమని ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియో తెలిపారు. "ప్రపంచకప్​ విలువేంటో మాకు తెలుసు. మనం చేసే పనుల వల్ల ఫుట్​బాల్ భవిష్యత్​ ఇబ్బందుల్లో పడకూడదు. దీనిపై ఓపెన్​ మైండ్​తో ముందుకెళ్లాల్సి ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పరుగుల కోసం కోచ్ రవిశాస్త్రి నయా ఫార్ములా!

Last Updated : May 22, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.