నైజీరియా మాజీ ఫుట్‌బాల్ కోచ్ శాంసన్ సియాసియాపై జీవితకాలం నిషేధం విధించింది అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా). మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైన కారణంగా అతడిపై వేటు వేసింది. ఫిఫా ఎథిక్స్ కమిటీ ముందు.. నేరం చేసినట్లు అంగీకరించాడు శాంసన్.
"శాంసన్ సియాసియా అవినీతికి పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ తేల్చింది. మ్యాచ్ ఫిక్స్ంగ్ చేసేందుకు లంచం తీసుకున్నట్టు అతడు ఒప్పుకున్నాడు. ఫిఫా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా శాంసన్‌పై జీవితకాల నిషేధం విధిస్తున్నాం" - ఫిఫా ప్రకటన.
నైజీరియా జాతీయ జట్టుకు 2010 - 2011 మధ్య కాలంలో కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు శాంసన్. ఆ సమయంలో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. శాంసన్ అండర్-20, అండర్-23 జట్లకూ కోచ్‌గా వ్యవహరించాడు.
ఇది చదవండి: టీమిండియా కోచ్: రవి భాయ్‌కే మళ్లీ పట్టం